Back to Lyrics
Manmadhudu

Manmadhudu

2002 · 6 songs

Telugu

నా  మనసునే  మీటకే  నేస్తమా
నా  దారిలో  చేరకే  చైత్రమా
సరదాల  చిలిపితనమా
చిరునవ్వులొని  స్వరమా
నా  తలుపు  తట్టి  కదిలించకే  కవ్వించకే  ప్రేమా
నా  మనసునే  మీటకే  నేస్తమా
నా  దారిలో  చేరకే  చైత్రమా

నాకెందుకిలా  ఔతోంది  చెప్పవా  ఒక్క  సారి
నీ  వెంటపడే  ఆశలకే  చూపవా  పూల  దారి
చినుకల్లే  చేరి  వరదల్లే  మారి  ముంచేస్తే  తేలేదెలాగా
తడిజాడ  లేని  తమ  గుండెలోని  దాహాలు  తీరేదెలాగా
లేనిపోని  సయ్యాటతో  వెంటాడకే  ప్రేమా
నీ  కనులలో  వెలగనీ  ప్రియతమా
నీ  పెదవికే  తెలుపనీ  మధురిమా

నీ  ఊహలలో  కొంటెతనం  పలకరిస్తోంది  నన్ను
నీ  ఊపిరితో  అల్లుకుని  పులకరిస్తోంది  వెన్ను
అలవాటు  పడిన  ఎద  చీకటింట  సరికొత్త  వేకువై  రావా
కిరణాలు  పడని  తెరచాటులోని  ఏకాంతమే  వదులుకోవా
నన్ను  నేను  మరిచేంతల  మురిపించకే  ప్రేమా
నీ  కనులలో  వెలగనీ  ప్రియతమా
నీ  పెదవికే  తెలుపనీ  మధురిమా
సరదాల  చిలిపితనమా
చిరునవ్వులొని  స్వరమా
నా  తలుపు  తట్టి  కదిలించకే  కవ్వించకే  ప్రేమా

English

Naa manasune meetake nesthamaa 
Naa daarilo cherake chaithramaa 
Saradaala chilipithanamaa chirunavvuloni swaramaa
Naa thalupu thatti kadilinchake kavvinchake premaa
Naa manasune meetake nesthamaa 
naa daarilo cherake chaithramaa 

Naakendukilaa outhondi cheppavaa okkasaari
Nee ventapade aasalaki choopavaa pooladaari
Chinukalle cheri varadalle maari munchesthe theledelaagaa
Thadi jaadaleni thama gundeloni daahaalu theeredelaagaa
Leni poni sayyaataku ventaadake premaa
Nee kanulalo velagani priyathamaa 
Nee pedavaki thelupani madhirimaa

Nee oohalalo kontethanam palakaristhondi nannu
Nee oopiritho allukoni pulakaristhondi vennu
Alavaatupadina eda cheekatinta sarikothha vekuvai raavaa
Kiranaalu padani thera chaatuloni ekaanthame vadulukovaa
Nannu nenu marichenthalaa muripinchake premaa
Nee kanulalo velagani priyathamaa 
Nee pedavaki thelupani madhirimaa
Saradaala chilipithanamaa chirunavvuloni swaramaa
Naa thalupu thatti kadilinchake kavvinchake premaa

Community

Like, share, and discuss

to start a discussion.