Back to Lyrics
Majnu

Majnu

2016 · 6 songs

Telugu

కళ్ళు  మూసి  తెరిచే  లోపే
గుండెలోకే  చేరావే
తనివి  తీరా  చూద్దామంటే  
పారిపోతావే

రాతిరంతా  కలలోకొచ్చి  
తీపి  కబురులు  చెబుతావే
తెల్లవారే  ఎదురైవస్తే  జారుకుంటావే

ఊరించకే  ఊరించకే  
ఆ  కొంటె  చూపుతోటి  నన్ను  చంపకే
కవ్వించకే  కవ్వించకే
నీ  నవ్వు  తోటి  మాయ  చెయ్యకులే  చెలియా

కళ్ళు  మూసి  తెరిచే  లోపే
గుండెలోకే  చేరావే
తనివి  తీరా  చూద్దామంటే  పారిపోతావే

ఆ  దొంగ  చూపు  హాజరేదో  నాకు  వేస్తావులే
ఎదురే  ఉంటే  చూడవులే
నే  వెళిపోతుంటే  నువ్వు  తొంగి  చూస్తావులే
నీ  గుండెలోన  ఎన్ని  వేల  ప్రేమ  లేఖలో
నీ  కళ్ళలోకి  ఒక్కసారి  చూస్తేనే  తెలిసిందిలే

కళ్ళు  మూసి  తెరిచే  లోపే  గుండెలోకే  చేరావే
తనివి  తీరా  చూద్దామంటే  పారిపోతావే

పుస్తకాలలో  నువ్వు  రాసుకున్న
పేరేమిటో  ఎగిరే  పేజీ  చెప్పిందే
నీ  కదిలే  పెదవే  
చిరు  సాక్షమిచ్చిందిలే
నను  నువ్వు  దాటి  వెళ్ళిపోవు  తొందరెందుకో
నీ  నీడ  నిన్ను  వీడి  నాకు  ఎదురొచ్చి  చెప్పిందిలే

సిగ్గు  నీకే  చాలా  అందం  
ముద్దు  ముద్దుగ  ఉంటావే
ఎంత  ముద్దుగ  ఉంటే  మాత్రం  
అంత  సిగ్గేంటే

ఎంత  దాచాలనుకున్నావో
అంత  బయటే  పడతావే
ఎంత  మౌనం  ఒలికేసావో  
అంత  తెలిసావే

తెలిసిందిలే  తెలిసిందిలే  
నీ  మూగ  కళ్ళలోని  భావమేమిటో
దొరికిందిలే  దొరికిందిలే  
నీ  దొంగ  నవ్వుకర్థమేమిటో  ఇపుడే

English

Kallu moosi terichelope
Gundeloke cherave
Tanivi teera choodhamante
Paaripotheve

Rathirantha kalalokochi
Teepi kaburulu chebuthave
Tellavare yedhurai vasthe
Jaarukuntave

Oorinchake oorinchake
Aa konte chooputhoti nannu champake
Kavvinchake kavvinchake
Nee navvuthoti maaya cheyakule cheliya

Kallu moosi terichelope
Gundeloke cherave
Tanivi teera choodhamante
Paaripotheve

Aa donga choopu haazaredo
Naku vesthavule
Yedhure vunte choodavule
Ne velipothunte
Nuvu thongi choosthavule
Nee gundelona yenni vela premalekhalo
Nee kallaloki okkasari
Choosthene telisindhile

Kallu moosi terichelope
Gundeloke cherave
Tanivi teera choodhamante
Paaripotheve

Pusthakallo nuvvu rasukunna peremito
Yegire pegi cheppindhe
Nee kadhile pedhave
Chiru sakshamichindhile
Nanu nuvvu dhati vellipovu
Thondharendhuko
Nee needa ninnu veedi naku
Yedhurochi cheppindhile

Siggu neeke chala andham
Mudhu mudhuga vuntave
Yentha mudhuga vunte matram antha siggente

Yentha dachalanukunnavo
Antha bayate padathave
Yentha mounam volikesavo antha telisave

Telisindhile telisindhile
Nee mooga kallaloni bhavamemito
Dorikindhile dorikindhile
Nee dhonga navvuku ardhamemito ipude

Community

Like, share, and discuss

to start a discussion.