Back to Lyrics
Janaki Weds Sriram

Janaki Weds Sriram

2003 · 2 songs

Telugu

రివ్వున  ఎగిరే  గువ్వా 
నీ  పరుగులు  ఎక్కడికమ్మా 

రివ్వున  ఎగిరే  గువ్వా 
నీ  పరుగులు  ఎక్కడికమ్మా 
మంచున  తడిసిన  పువ్వా 
ఈ  నవ్వులు  ఎవ్వరివమ్మా

నీ  రాజు  ఎవ్వరంటా 
ఈరోజే  చెప్పమంటా 
నీ  రాజు  ఎవ్వరంటా 
ఈరోజే  చెప్పమంటా 

ఓఓఓఓ  హెయి

అల్లరి  పిల్లకు  నేడు
వేయాలిక  మెళ్ళో  తాడు 
ముడివేసే  సిరిగల  మొనగాడు
ఎవరే  వాడు 

చక్కని  రాముడు  వీడు 
నీ  వరసకు  మొగుడవుతాడు 
ఇల్లాలిని  వదిలిన  ఆ  ఘనుడు
ఈ  పిరికోడు 

ఆ  కృష్ణుడి  అంశన  వీడే 
నీ  కొరకే  ఇలా  పుట్టాడే 
గోపికలే  వస్తే  అటే  పరిగెడతాడే 

ఓ  గడసరి  పిల్ల 
నీ  కడుపున  కొడుకై  పుడతానే 
కూతురుగా  పుట్టు  నీ  పేరే  పెడతాలే 

గొడవెందుకు  బావతో  వెళతావా 
పద  బావా  పాలకోవా 

రివ్వున  ఎగిరే  గువ్వా 
నీ  పరుగులు  ఎక్కడికమ్మా 
మంచున  తడిసిన  పువ్వా 
ఈ  నవ్వులు  ఎవ్వరివమ్మా 

నీ  రాజు  ఎవ్వరంటా
ఈరోజే  చెప్పమంటా 

చిటపట  చినుకులు  రాలి 
అవి  చివరకు  ఎటు  చేరాలి 
సెలయేరులు  పారే  దారుల్లో
కొలువుండాలి 

నిండుగ  నదులే  ఉరికి 
అవి  చేరును  ఏ  ఈ  దరికి
కలకాలం  కడలిని 
చేరంగా  పరిగెడతాయి 

అట్టాగే  నాతో  నీవు
నీతో  నేను  ఉండాలి 
బతుకంతా  ఒకటై  ఇలా  జత  కావాలి 

మన  బొమ్మల  పెళ్లి 
నువ్వే  తాళిని  మెళ్ళో  కడతావా   
మరు  జన్మకు  కూడా  ఇలా  తోడుంటావా 

ఓ  బావ  ఒట్టే  పెడుతున్నా 
నే  కూడా  ఒట్టేస్తున్నా

రివ్వున  ఎగిరే  గువ్వా 
నీ  పరుగులు  ఎక్కడికమ్మా 
మంచున  తడిసిన  పువ్వా 
ఈ  నవ్వులు  ఎవ్వరివమ్మా 

నా  రాజు  నువ్వేనంట 
ఈరోజే  తేలిసిందంట 
నా  రాజు  నువ్వేనంట 
ఈరోజే  తెలిసిందంట 

ఓఓఓ  హెయి

English

Rivvuna egire guvvaa
Nee parugulu ekkadikammaa

Rivvuna egire guvva
Nee parugulu ekkadikamma
Manchuna thadisina puvva
Ee navvulu evvarivamma

Nee raaju evvaranta
Ee roje cheppamantaa
Nee raaju evvaranta
Ee roje cheppamantaa

Oooo heee

Allari pillaku nedu
Veyalika mello thaadu
Mudi vese siri gala monagaadu
Yevare vaadu

Chakkani ramudu veedu
Nee varasaku mogudavuthadu
Illalini vadilina aa ghanudu
Ee pirikodu

Aa krishnudi amshana veede
Nee korake ila puttade
Gopikale vasthe ate parigedathade

O gadasari pilla
Nee kadupuna kodukai pudathane
Kuthuruga puttu
Nee pere pedathale

Godavenduku baavatho velathaava
Pada baava paalakova

Rivvuna egire guvva
Nee parugulu ekkadikamma
Manchuna thadisina puvva
Ee navvulu evvarivamma

Nee raaju evvaranta
Ee roje cheppamantaa

Chitapata chinukulu raali
Avi chivaraku yetu cherali
Selayerulu paare darullo
Koluvundali

Ninduga nadule urike
Avi cherunu ye ee darike
Kalakaalam kadalini
Cheranga parigedathayi

Attage naatho neevu
Neetho nenu undali
Bathukantha okatayi
Ila jatha kavali

Mana bommala pelli
Nuve thali ni mello kadathava
Maru janmaku kuda
Ila thoduntaava

O baava otte peduthunna
Ne kuda ottesthunna

Rivvuna egire guvva
Nee parugulu ekkadikamma
Manchuna thadisina puvva
Ee navvulu evvarivamma

Na raju nuvvenanta
Ee roje thelisindanta
Na raju nuvvenanta
Ee roje thelisindanta

Ooo hee

Community

Like, share, and discuss

to start a discussion.