Back to Lyrics
HanuMan

HanuMan

2024 · 14 songs

Telugu

అంజనాద్రిపై  సంతతి  కొరకై
అహో  రాత్రములు
తపస్సు  చేసే  వానర  కేసరి
కేసరి  కులసతి  కడుపు  పండగా

జనించినాడొక  అసమాన
భలోద్బదుడు  సంయుతుడూ
అంజనా  సుతుడూ  పవన  నందనుడూ

అరుణ  కిరణముల  ఉదయాగ్నిని  కని
అది  పండిన  తియ్యని  పండనుకొని
సూర్యమండలము  పట్టి  తినాలని  ఉవ్విళ్ళూరే

తన  దేహం  మాటున  రవిమరుగై
జగము  చీకటై  పోగా

అది  అమరేంద్రుడు  గమనించి
తన  ఐరావతమధిరోహించి
ఆంజనేయుని  సమీపించి
తన  వజ్రాయుధమును  విసరగా

అది  పవన  నందనుని  హనుముని  తాక
చిందిన  రక్త  బిందువే
విద్యుత్  వేగంతో  ధరణీ  స్థలి
గంగ  కడలిలో  చొచ్చి

గంగ  కడలి  అట్టడుగున  గల
శ్రీ  రంగ  శుద్ధి  గర్భమ్ము  చేరి  యట

కాలక్రమమున  ఘనీభవించి
హనుమ  రుధిరమని  ఘనియై
అర్హత  గల  ఒక  సహృదయునికై
నిరంతనిశ్చల  నిరీక్షణం
వర్ష  సహస్రక  నిరీక్షణం
నిరంతనిశ్చల  నిరీక్షణం
వర్ష  సహస్రక  నిరీక్షణం

English

Anjanadripai Santhathi Korakai
Aho Raathramulu
Thapassu Chese Vaanara Kesari
Kesari Kulasathi Kadupu Pandagaa

Janinchinaadoka Asamaana
Bhalodhabhudu Samyuthudu
Anjanaa Suthudu Pavana Nandhanudu

Aruna Kiranamula Udayaagnini Kani
Adhi Pandina Thiyyani Pandanukoni
Sooryamandalamu Patti Tinaalani Uvvilloore

Thana Deham Maatuna Ravi Marugai
Jagamu Cheekatai Pogaa

Adhi Amarendhrudu Gamaninchi
Thana Iraavathamadhirohinchi
Aanjaneyuni Sameepinchi
Thana Vajraayudhamunu Visaragaa

Adhi Pavana Nandhanuni Hanumuni Thaaka
Chindhina Raktha Bindhuve
Vidhyuth Vegamtho Dharani Sthali
Ganga Kadalilo Chochhi

Ganga Kadali Attaduguna Gala
Sree Ranga Shuddhi Garbammu Cheri Yata

Kaalakramamuna Ghaneebhavinchi
Hanuma Rudhiramani Ghaniyai
Arhata Gala Oka Sahrudayunikai
Niranthanischala Nireekshanam
Varsha Sahasraka Nireekshanam
Niranthanischala Nireekshanam
Varsha Sahasraka Nireekshanam

Community

Like, share, and discuss

to start a discussion.