Back to Lyrics
Ela Cheppanu

Ela Cheppanu

2003 · 3 songs

Telugu

ప్రతీ  నిజం  పగటి  కలగా
నిరాశగా  నిలవనా 
ప్రతీ  క్షణం  కలత  పడగా
నిరీక్షగా  గడపనా

 కన్నీటి  సంద్రంలో  నావనై
ఎన్నాళ్లీ  ఎదురీత 
ఏనాడు  ఏ  తీరం
ఎదుట  కనపడక 

ప్రతీ  నిజం  పగటి  కలగా
నిరాశగా  నిలవనా 
ప్రతీ  క్షణం  కలత  పడగా
నిరీక్షగా  గడపనా

పెదవులు  మరచిన  చిరునగవై
నిను  రమ్మని  పిలిచానా 
వెతకని  వెలుగుల  పరిచయమై
వరమిమ్మని  అడిగానా 

నిదరపోయే  ఎదను  లేపి
నిశిని  చూపించగా 

ఆశతో  చాచిన  దోసిట  శూన్యం  నింపి  
కరగకుమా  నా  కన్నులనే  వెలివేసి

ప్రతీ  నిజం  పగటి  కలగా
నిరాశగా  నిలవనా 
ప్రతీ  క్షణం  కలత  పడగా
నిరీక్షగా  గడపనా 

ఎక్కడ  నువ్వని  దిక్కులలో
నిను  వెతికిన  నా  కేక 
శిలలను  తాకిన  ప్రతిధ్వనిగా
నను  చేరితే  ఒంటరిగా

సగములోనే  అలసిపోయి
పయనం  అయ్యాగా

ఇసుకలో  చేసిన  సంతకమా  నీ  స్నేహం 
ఏ  అల  నిను  చెరిపిందో   తెలుపదు  కాలం

English

Prati nijam pagati kalagaa
Niraashaga nilavanaa
Prati kshanam kalatha padaga
Nireekshaga gadapana

Kanneeti sandramlo naavanai
Yennalli edureeta
Enaadu ea teeram
Yeduta kanapadaka

Prati nijam pagati kalagaa
Niraashaga nilavanaa
Prati kshanam kalatha padaga
Nireekshaga gadapana

Pedavulu marachina chirunagavai
Ninu rammani pilichana
Vetakani velugula parichayamai
Varamimmani adigaana

Nidarapoye yedanu lepi
Nishini choopinchagaa

Aashatho chaachina dosita
Shunyam nimpi
Karagakuma naa kannulane
Velivesi

Prati nijam pagati kalagaa
Niraashaga nilavanaa
Prati kshanam kalatha padaga
Nireekshaga gadapana

Ekkada nuvvani dikkulalo
Ninu vetikina naa keka
Shilalanu takina pratidhwani ga
Nanu cherite ontariga

Sagamulone alasipoyi
Payanam ayyaaga

Isukalo chesina santakamaa
Nee shneham
E ala ninu cheripindho
Telupadu kaalam

Community

Like, share, and discuss

to start a discussion.