Back to Lyrics
Bavagaru Bagunnara

Bavagaru Bagunnara

1998 · 3 songs

Telugu

నవమి  దశమి  తగిన  రోజులు   
యువతీ  యువకుల  తపనలకూ  
మకరం  మిధునం  వృషభ  రాసులు  
అనుకూలించును  రసికులకూ 
 
దొరికినది  సమయం  ఓఓఓ 
విరహముతో  సమరం   
సాయం  అందించు  ఆలించు  పాలించు   
బిడియం  చాలించు  చుంబించు  చిగురించు 
  
నవమి  దశమి  తగిన  రోజులు   
యువతీ  యువకుల  తపనలకూ  

ప్రాయం  పెరటిలో  లతలు  అడిగే   
తొలకరి  చినుకువు  నువ్వే  
సాయం  సంధ్యలో  స్వాగతించే   
పడమర  ప్రమిదవు  నువ్వే 

చెంగావి  రంగుల్లో  చీరని 
కంగారు  రాగాలే  తీయనీ 
దీపం  వెలిగించు  ఒడిపంచు  చలి  దించు   
తాపం  వివరించు  వినిపించు  వికసించు  

నవమి  దశమి  తగిన  రోజులు   
యువతీ  యువకుల  తపనలకూ  

స్వర్గం  దారిలో  పరుగు  తీసే    
పరువపు  పరవడి  నీదే 
సర్వం  దోచగా  ఎదురు  చూసే  
మదనుడి  ఒరవడి  నీదే 

కావేరి  పొంగుల్లో  మునగానీ 
కస్తూరి  తిలకాలే  కరగానీ  
మైకం  కలిగించు  కవ్వించు  కరుణించు  
మంత్రం  పలికించు  పులకించు  పవళించు  
 
నవమి  దశమి  తగిన  రోజులు   
యువతీ  యువకుల  తపనలకూ  
మకరం  మిధునం  వృషభ  రాసులు  
అనుకూలించును  రసికులకూ  

దొరికినది  సమయం  ఓఓఓ 
విరహముతో  సమరం 
సాయం  అందించు  ఆలించు  పాలించు   
బిడియం  చాలించు  చుంబించు  చిగురించు

English

Navami Dashami Thaggina Rojulu 
Yuvathi Yuvakula Thapanalakuu 
Makaram Midhunam Vrushaba Raasulu 
Anukoolinchunu Rasikulakuu 

Dorikinadee Samayam Ooo
Virahamutho Samaram 
Saayam Andinchu Aalinchu Paalinchu 
Bidiyam Chaalinchu Chumbinchu Chigurinchuu 

Navami Dashami Thaggina Rojulu 
Yuvathi Yuvakula Thapanalakuu

Praayam Peratilo Lathalu Adige 
Tholakari Chinukuvu Nuvve 
Saayam Sandyalo Swaagatinche 
Padamara Pramidavu Nuvve

Chengaavi Rangullo Cheeranee
Kangaaru Ragaale Theeyanee
Deepam Veliginchu Odipanchu Chali Dinchu 
Thaapam Vivarinchu Vinipinchu Vikasinchu
 
Navami Dashami Thaggina Rojulu 
Yuvathi Yuvakula Thapanalakuu

Swargam Daarilo Parugu Theese 
Paruvapu Paravadi Needhe
Sarvam Dochagaa Yedhuru Choose 
Madhanudi Oravadi Needhe

Kaaveri Pongullo Munaganee
Kasturi Tilakaale Karaganee 
Maikam Kaliginchu Kavvinchu Karuninchu 
Mantram Palikinchu Pulakinchu Pavalinchu
 
Navami Dashami Thaggina Rojulu 
Yuvathi Yuvakula Thapanalakuu 
Makaram Midhunam Vrushaba Raasulu 
Anukoolinchunu Rasikulakuu 

Dorikinadee Samayam Ooo
Virahamutho Samaram
Saayam Andinchu Aalinchu Paalinchu 
Bidiyam Chaalinchu Chumbinchu Chigurinchuu

Community

Like, share, and discuss

to start a discussion.