Back to Lyrics

Avakaya Biryani

2008 · 5 songs

Singer
Lyricist

Telugu

అదిగదిగో  ఆశలు  రేపుతూ  
ఎదురుగ  వాలే  ఎన్నో  వర్ణాలు  
ఇదిగిదుగో  కళలను  చూపుతూ  
ఎదలను  ఏలే  ఏవో  వైనాలు 

ఎగిరొచ్చే  ఆ  గువ్వల  చిగురించే  ఈ  నవ్వుల  
సాగే  ఈ  సావాసం 
ప్రతి  హృదయంలో  ఆ  కల  నిజమైతే  ఆపేదెలా  
పొంగే  ఆనందం 
కలైనా  ఇదో  కథయినా  రచించే  ఏవో  రాగాలే 

ఈ  సమయం  ఏ  తలపులలో  
తన  గురుతుగ  విడిచెళుతుందో    
ఏ  మనుసుకు  జత  ఏదంటే  
తాను  ఏమని  బదులిస్తుందో 

వరమనుకో  దొరికిన  జీవితం  
ఋతువు  గీసే  రంగుల  ఓహ్  చిత్రం 
ఈ  పయనం  ఏ  మలుపులో  
తన  గమ్యాన్నే  చేరునో  చూపే  దారేది 
వరించే  ప్రతి  క్షణాన్ని  జయించే  స్నేహం  తొడవని 

తన  గూటిని  వెతికే  కళ్ళు  
గమనించవు  ఎద  లోగిళ్ళు 
తల  వాల్చిన  మలి  సంధ్యల్లో   
సెలవడిగెను  తొలి  సందళ్ళు

English

Adigadigo Aasalu Reputhu 
Eduruga Vaale Enno Vamaalu
Ldhugidhugo Kalalanu Chooputhu 
Yedhalanu Yele Evo Vainallu

Egiroche Aa Guvvala Chigurinche Ee Navvala 
Saage Ee Savasam
Prathi Hrudhyam Lo Aa Kala Nijamaithe Aa Pedhela 
Ponge Anandham
Kalainaa Dho Kadhainaaa Rachinche Yevo Ragaale

Ee Samayam Ye Thalapulalo 
Thana Guruthu Ga Vidhicheluthundho
Ye Manusku Jatha Edante 
Thanu Emani Badulisthundho

Varamanuko Dhorikina Jeevitham 
Ruthuvu Geese Rangula Oh Chitram
Ee Payanam Ye Malupulo 
Thana Gamyanne Cheruno Choope Daaredhi
Varinche Prathi Kshanani Jayinche Sneham Thodavani

Thana Gootini Vethike Kallu 
Gamaninchavu Yedha Logillu
Thala Valchina Mali Sandhyallo 
Selevadigenu Tholi Sandallu

Community

Like, share, and discuss

to start a discussion.