Back to Lyrics
Aay

Aay

2024 · 2 songs

Telugu

ఎవరే  పిల్లా  
అరవిరసిన  మల్లా
నువ్  ఎవరే  పిల్లా  
తొలకరి  చిరుజల్లా

కుదురైన  కుర్రాడిని  
కొరికుదిపేసిందే  
తీరైన  చిన్నోడిని  
ప్రేమలొ  ముంచేసిందే  

కన్నే  కునుకొదిలేసె  
కళ్ళల్లో  కలువలు  పూసె
నీ  కలలతొ  నను  కమ్మేసే  
కనికారం  బావుందమ్మా

పెదవే  పలుకొదిలేసే  
నీ  మౌనంలో  మునకేసే
మెలమెల్లగ  ప్రాణం  తీసే  
సుకుమారం  నీదేలేమ్మా

అరకొరగా  చూసే  నీ  చూపే
సరిపడకా  నీ  దారుల  వేచే
కలివిడిగా  ఆడే  నీ  మాటే
విడిపడనీ  ముడి  ఎదో  ఏసే

సూఫియానా  సూఫియానా
గుండెల్లోనా  ప్రేమవానా

ఏంటమ్మా  కులుకా  
నీ  ఎనకే  ఎనకే  తిరిగాక
కాదంటే  ఎలగే  నిను  తీరా  వలచాక

ఏంటమ్మా  తళుకా  
అట్టాగే  గాలికి  వదిలెయ్  కా
కాస్తైనా  వినవే  ఈ  పిల్లాడి  ఊసింత

చీకటినెరుగవు  నీ  నయనాలు
వెలుతురులూరగ  నీ  కనుచూపులు
శీతలమౌనే  ఆ  పవనాలు
సోకినా  చాలే  నీ  పాదాలు

నీ  వలనే  అలలు  గోదారినా
వదిలెయ్  కే  నన్ను  నాదారినా
నీ  చలవే  జాబిలై  నింగినా
ఈ  నేలకు  వెన్నెలై  జారినా

సూఫియానా  సూఫియానా
గుండెల్లోనా  ప్రేమవానా

English

Yevare Pilla 
Aravirisina Malla
Nuv Evare Pilla 
Tholakari Chiru Jalla

Kudhuraina Kurradini
Korikudhipesindey
Thiraina Chinnodini
Premalo Munchesindhey

Kanne Kunukodhilesey
Kallallo Kaluvalu puse
Nee Kalalatho Nannu Kammese
Kanikaram Bavundhamma

Pedhave Palukodhilesey
Nee Mounamlo Munakesey
Mela Mellaga Pranam Tesey
Sukumaram Nedhelemma

Arakoraga Chuse Nee Chupe
Saripadaka Nee Dharula Veche
Kalividiga Ade Nee Mate
Vedipadani Mudi yedho Esey

Sufiyana Sufiyana
Gundallonaa Premavaana

Yentamma Kuluka
Nee Yenake Yenake Tirigaka
Kadhante yelage Ninnu Tira Valachaka

Yentamma Taluka
Attage Galiki Vadileyaka
Kasthaina Vinave Ee Pilladi Usintha

Chikatineragavu Nee Nayanalu
Veluthuruluraga Ni Kanuchupulu
Shithalamaune Aa Pavanalu
Sokina Chale Nee Padhalu

Nee Valane Alalu Godharina
Vadileike Nannu Na Dharinaa
Nee Chalave Jabilai Ningina
Ee Nelaku Vennalai Jarina

Sufiyana Sufiyana
Gundallonaa Premavaana

Community

Like, share, and discuss

to start a discussion.