Back to Lyrics
Yevadu

Yevadu

2014 · 6 songs

Telugu

మండే  సూరీడల్లే  నిండే  నిప్పులల్లే 
భగ  భగ  మన్నది  నీ  హృదయం 
పొంగే  ఉప్పెనల్లె  నింగే  మృత్యువల్లే 
పగ  పగ  అన్నది  నా  హృదయం 
ఇలా  ఇలా  జ్వలించుతోంది  నా  ఎద 
ఎడారిలా  జలించే  నా  కథా 
చెలియా  చెలియా  చెలియా  చెలియా 
మసి  చేస్తుంది  ఈ  దూరం 
చెలియా  చెలియా  నా  ఊపిరిలో 
నిండే  ఉండే  నీ  ప్రాణం 

పువ్వేదో  నన్ను  తాకితే 
నవ్వేదో  నన్ను  చేరితే 
నువ్వేదో  అన్న  తీపి  జ్ఞ్యాపకం 
వెన్నెల్లు  వెన్ను  మీటితే 
కన్నీళ్లు  కన్ను  దాటితే 
నన్నల్లుకున్న  చూపు  జ్ఞ్యాపకం 
ప్రతీ  దినం  ప్రతీ  క్షణం 
నీ  ప్రేమలో  ప్రదక్షణం 
తెగించమంది  నన్నే  తక్షణం 
చెలియా  చెలియా  చెలియా  చెలియా 
మసి  చేస్తుంది  ఈ  దూరం 
చెలియా చెలియా  నా  ఊపిరిలో 
నిండే  ఉండే  నీ  ప్రాణం 

ప్రయాణమాయె  జీవితం 
ప్రమాదమాయే  నా  పదం 
శరీరమాయె  మారణాయుధం 
నరాల  రక్త  సాగరం 
కణాల  అగ్ని  పర్వతం 
కలేసి  రాసే  మృత్యు  శాసనం 
ఒకే  వ్రతం  వినాశనం 
ఒకే  విధం  విధ్వంసనం 
నా  వేటకింకా లేదే  విరమణం 
ఓ చెలియా  చెలియా  చెలియా చెలియా 
మసి  చేస్తుంది  ఈ  దూరం 
చెలియా  చెలియా  నా  ఊపిరిలో 
నిండే  ఉందే  నీ  ప్రాణం

English

Mande sureedalle ninde nippulalle
Bhaga bhaga mannadi nee hrudayam
Ponge uppenalle ninge mruthyuvalle
Paga paga annadi naa hrudayam
Ilaa ilaa jwalinchuthondi naa yeda
Yedaarilaa jalinche naa kathaa
Cheliyaa cheliyaa cheliyaa cheliyaa
Masi chesthunde ee dooram
Cheliyaa cheliyaa naa oopirilo
Ninde unde nee praanam

Puvvedo nannu thaakithe
Navvedo nannu cherithe
Nuvvedo anna theepi gnyapakam
Vennellu vennu meetithe
Kanneellu kannu daatithe
Nannallukunna choopu gnyaapakam
Prathee dinam prathee kshanam
Nee premalo pradakshanam
Theginchamandi nanne thakshanam
Cheliyaa cheliyaa cheliyaa cheliyaa
Masi chesthunde ee dooram
Cheliyaa cheliyaa naa oopirilo
Ninde unde nee praanam

Prayaanamaaye jeevitham
Pramaadamaaye naa padam
Shareeramaaye maaranaayudham
Naraala raktha saagaram
Kanaala agni parvatham
Khalesi raase mruthyu shaasanam
Oke vratham vinaashanam
Oke vidham vidhvamsanam
Naa vetakinka lede viramanam
Oo cheliyaa cheliyaa cheliyaa cheliyaa
Masi chesthunde ee dooram
Cheliyaa cheliyaa naa oopirilo
Ninde unde nee praanam

Community

Like, share, and discuss

to start a discussion.