Back to Lyrics
Vaana

Vaana

2008 · 2 songs

Telugu

ఎదుట  నిలిచింది  చూడు
జలతారు  వెన్నెలేమో 
ఎదను  తడిపింది  నేడు
చినుకంటి  చిన్నదేమో 
మైమరచిపోయా  మాయలో 

ప్రాణమంత  మీటుతుంటే
వాన  వీణలా  

ఎదుట  నిలిచింది  చూడు 

నిజంలాంటి  ఈ  స్వప్నం
ఎలా  పట్టి  ఆపాలి
 కలే  అయితే  ఆ  నిజం
ఎలా  తట్టుకోవాలీ 

అవునో  కాదో
అడగకంది  నా  మౌనం 
చెలివో  శిలవో
తెలియకుంది  నీ  రూపం

చెలిమి  బంధం  అల్లుకుందే
జన్మ  ఖైదులా 

ఎదుట  నిలిచింది  చూడు 

నిన్నే  చేరుకోలేకా
ఎటెళ్ళిందో  నా  లేఖ
వినేవారు  లేక
విసుక్కుంది  నా  కేక 

నీదో  కాదో
వ్రాసున్న  చిరునామా 
ఉందో  లేదో
ఆ  చోట  నా  ప్రేమా

వరంలాంటి  శాపమేదో
సొంతమైందిలా 

ఎదుట  నిలిచింది  చూడు 
జలతారు  వెన్నెలేమో 
ఎదను  తడిపింది  నేడు
చినుకంటి  చిన్నదేమో 
మైమరచిపోయా  మాయలో 

ప్రాణమంత  మీటుతుంటే
వాన  వీణలా  

ఎదుట  నిలిచింది  చూడు

English

Yeduta nilichindi choodu
Jalathaaru vennelemo
Yedanu thadipindi nedu
Chinukanti chinnademo
Maimarachipoyaa mayalo

Pranamantha meetuthunte
Vaana veenalaa 

Yeduta nilichindi choodu

Nijamlaanti ee swapnam
Elaa patti aapali
Kale aithe aa nijam
Ela tattukovaalee

Avuno kaado
Adagakandi na mounam
Chelivo shilavo
Theliyakundi nee roopam

Chelimi bandham allukunde
Janma khaidulaa

Yeduta nilichindi choodu

Ninne cherukolekaa 
EteLlindo na lekha
Vinevaaru lekaa
Visukkundi na keka

Needo kaado
Vrasunna chirunaamaa
Vundo ledo
Aa chota na premaa

Varamlaanti shapamedo
Sonthamaindilaa

Yeduta nilichindi choodu
Jalathaaru vennelemo
Yedanu thadipindi nedu
Chinukanti chinnademo

Maimarachipoyaa mayalo
Pranamantha meetuthunte
Vaana veenalaa 

Yeduta nilichindi choodu

Community

Like, share, and discuss

to start a discussion.