Back to Lyrics
Uppena

Uppena

2021 · 5 songs

Telugu

జింజిక్  జింజిక్  చా  జింజిక్  జింజిక్  చా
జింజిక్  జింజిక్  చా  జింజిక్  జింజిక్  చా
జింజిక్  జింజిక్  చా  జింజిక్  జింజిక్  చా
జింజిక్  జింజిక్  చా  జింజిక్  జింజిక్  చా

రంగులద్దుకున్నా  తెల్ల  రంగులౌదాం
పూలు  కప్పుకున్నా  కొమ్మలల్లే  ఉందాం
ఆకు  చాటునున్నా  పచ్చి  పిందెలౌదాం
మట్టి  లోపలున్నా  జంట  వేరులౌదాం
ఎవ్వరీ  కంటిచూపు  చేరలేని  ఎక్కడా  మన  జంట  ఊసురాని
చోటునా  పద  నువ్వు  నేనుందాం

జింజిక్  జింజిక్  చా  జింజిక్  జింజిక్  చా
హ్మ్  హ్మ్
రంగులద్దుకున్నా  తెల్ల  రంగులౌదాం
పూలు  కప్పుకున్నా  కొమ్మలల్లే  ఉందాం

తేనె  పట్టులోనా  తీపి  గుట్టు  ఉందిలే
మన  జట్టులోనా  ప్రేమ  గుట్టుగుందిలే
వలలు  తప్పించుకెళ్ళు  మీనాల  వైనాల
కొంటె  కోణాలు  తెలుసుకుందాం  ఆఆ
లోకాల  చూపుల్ని  ఎట్టా  తప్పించుకెళ్ళాలో
కొత్త  పాఠాలు  నేర్చుకుందాం
అందరూ  ఉన్న  చోట  ఇద్దరౌదాం  ఎవ్వరూ  లేని  చోట  ఒక్కరౌదాం
ఏ  క్షణం  విడివిడిగా  లేమందాం

రంగులద్దుకున్నా  తెల్ల  రంగులౌదాం
పూలు  కప్పుకున్నా  కొమ్మలల్లే  ఉందాం

మన  ఊసు  మోసే  గాలిని  మూట  కడదాం
మన  జాడ  తెలిపే  నేలను  పాతి  పెడదాం
చూస్తున్నా  సూర్యుని  తెచ్చి  లాంతర్లో  దీపాన్ని  చేసి
చూరుకేలాడదీద్దాం  ఆఆ
సాక్ష్యంగా  సంద్రాలు  ఉంటె  దిగుడు  బావిలో
దాచి  మూత  పెడదాం
నేనిలా  నీతో  ఉండడం  కోసం  చేయనీ  ఈ  చిన్నపాటి  మోసం
నేరమేం  కాదే  ఇది  మన  కోసం

రాయిలోన  శిల్పం  దాగి  ఉండునంటా  శిల్పి  ఎదురైతే  బయటపడునంటా
అద్ధమెక్కడున్నా  ఆవైపు  వెళ్ళకంటా  ఆ  ఆ
నీలో  ఉన్నా  నేనే  బయటపడిపోత  ఆఆ
పాలలో  ఉన్నా  నీటిబొట్టులాగా  నీళ్లలో  దాగి  ఉన్నా  మెట్టులాగా
నీనిలా  నీ  లోపల  దాక్కుంటా

హైలెస్సా  హైలెస్సా  హాయ్  హైలెస్సా  హైలెస్సా  హాయ్
హైలెస్సా  హైలెస్సా  హాయ్  హైలెస్సా  హైలెస్సా  హాయ్

English

Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa
Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa
Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa
Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa

Ranguladdhukunna Thella Ranguloudhaam
Poolu Kappukunnaa Kommalalle Undhaam
Aaku Chaatununnaa Pachhi Pindheloudhaam
Mattilopalunnaa Janta Veruloudhaam
Evvaree Kantichoopu Cheraleni Ekkadaa Mana Janta Oosuraani
Chotuna Padha Nuvvu Nenundhaam

Jinjik Jinjink Chaa Jinjik Jinjink Chaa
Hmmm Hmmm
Ranguladdhukunna Thella Ranguloudhaam
Poolu Kappukunnaa Kommalalle Undhaam

Thene Pattulona Theepi Guttu Undhile
Mana Jattulona Prema Guttugundhile
Valalu Thappinchukellu Meenaala Vainaala
Konte Konaalu Thelusukundhaam Aa Aa
Lokaala Choopulni Ettaa Thappinchukellaalo
Kottha Paataalu Nerchukundhaam
Andharu Unna Chota Iddharoudhaam Evvaroo Leni Chota Okkaroudhaam
Ye Kshanam Vidividigaa Lemandhaam

Ranguladdhukunna Thella Ranguloudhaam
Poolu Kappukunnaa Kommalalle Undhaam

Mana Oosu Mose Gaalni Moota Kadadhaam
Mana Jaada Thelipe Nelanu Paathi Pedadhaam
Choosthunna Sooryunni Thechhi Laantharlo Dheepaanni Chesi
Choorukelaadadheeddhaam AaAa
Saakshamgaa Sandhraalu Unte Dhigudu Baavilo
Dhaachi Mootha Pedadhaam
Nenilaa Neetho Undadam Kosam Cheyanee Ee Chinnapaati Mosam
Neramemo Kaadhe Idhi Mana Kosam

Raayilona Shiplam Dhaagi Undunantaa 
Shilpi Edhuraithe Bayatapadunantaa
Addhamekkadunnaa Aavaipu Vellakantaa AaAa
Neelo Unna Nene Bayatapadipothaa AaAa
Paalalo Unna Neetibottu Laagaa Neellalo Dhaagi Unna Mettulaagaa
Neenilaa Nee Lopala Dhaakkuntaa

Hailessa Hailessa Hai
Hailessa Hailessa Hai
Hailessa Hailessa Hai
Hailessa Hailessa Hai

Community

Like, share, and discuss

to start a discussion.