Back to Lyrics
Swayamvaram

Swayamvaram

1999 · 3 songs

Telugu

పికాసో  చిత్రమా  ఎల్లోరా  శిల్పమా
నీ  పెదవుల  దాగిన  మందారాలకి  ఓ  చెలీ  సలామ్
నీ  నడుముని  వీడని  వయ్యారాలకి  కాముడే  గులామ్

పికాసో  చిత్రమా  ఎల్లోరా  శిల్పమా

నీ  తనువు  తాకి  చిరుగాలికొచ్చే  మైమరపు  సత్యభామా
నీ  నీలి  కురుల  కిరణాలు  సోకి  వసి  వాడె  చందమామ
ఏ  దివ్య  వరమో  అది  నీ  కంఠస్వరమై
ఏ  వింటి  శరమో  అది  నీ  కంటి  వశమై
అంగాంగాన  శృంగారాన్ని  సింగారించగా
అభిమానాన్ని  అనురాగంతో  అభిషేకించగా
మనసే  మౌన  సంగీతాన్ని  ఆలాపించగా
వయసే  పూల  పరుపై  నిన్ను  ఆహ్వానించదా
ఏ  శృతిలో  లయమగు  తాళం  నీవే  కన్యకామణి
ఏ  సేవలతో  నిను  మెప్పించాలే  మందగామిని

పికాసో  చిత్రమా  ఎల్లోరా  శిల్పమా

ఏ  మెరుపు  తగిలి  భువికొచ్చినావే  అందాల  మేఘమాలా
నీ  కులుకు  చూసి  నా  గుండెలోన  రగిలిందే  విరహా  జ్వాలా
నీ  చూపు  తగిలి  ఇక  నేనుండగలనా
నా  బాధ  తెలిసి  జత  రావేమె  లలనా
నాలో  ఉన్న  ఉల్లాసాన్ని  నువు  ప్రేమించగా
నీలో  ఉన్న  సౌందర్యాన్ని  నే  లాలించనా
ఏకాంతాన  నువ్వు  నేను  ఉయ్యాలూగగా
లోకాలన్ని  నిన్నూ  నన్ను  దీవించేయవా
ఏ  వెన్నెల  ఒడిలో  ఉదయించావే  నిండు  జాబిలి
నీ  కౌగిళి  లేక  తీరేదెట్టా  తీపి  ఆకలి

పికాసో  చిత్రమా  ఎల్లోరా  శిల్పమా
నీ  పెదవుల  దాగిన  మందారాలకి  ఓ  చెలీ  సలామ్
నీ  నడుముని  వీడని  వయ్యారాలకి  కాముడే  గులామ్

పికాసో  చిత్రమా  ఎల్లోరా  శిల్పమా

English

Pikaso chitrama yellora shilpama
nee peduvula dagina mandaralaki o cheli salam
nee nadumuni veedani vayyaralaki kaamude gulaam
Pikaso chitrama yellora shilpama

Nee thanuvu thaki chirugalikoche maimarapu satyabhama
ni neeli kurula kiranalu soki vasi vade chandamama
ye divya varamo adhi nee kanta swaramai
ye vinti sharamo adi nee kanti vashamai
angangana shrungaranni singarinchaga
Abhimananni anuragam tho abhishekinchaga
manase mouna sangeethanni alaapinchada
vayase pula parupai ninnu aahwaninchada
ye shruthi lo layamagu thaalam neeve kanne kamani
ye sevalatho ninu meppinchale mandagamini

Pikaso chitrama yellora shilpama

Ye merupu thagili bhuvkochinaave andala meghamala
nee kuluku chusi na gundelona ragilindhe viraha jwala
nee chupu thagili ika nenundagalana
na badha telisi jatha raaveme lalana
nalo unna ullasanni nuvu premichaga
nilo unna soundaryanni ne laalinchana
ekantana nuvu nenu vuyyalugaga
lokalanni ninnu nannu divencheyava
ye vennela vodilo udayinchave nindu jabili
nee kowgili lekha thiredetta theepi akali

Pikaso chitrama yellora shilpama
nee peduvula dagina mandaralaki o cheli salam
nee nadumuni veedani vayyaralaki kaamude gulaam
Pikaso chitrama yellora shilpama

Community

Like, share, and discuss

to start a discussion.