Back to Lyrics
Sneham Kosam

Sneham Kosam

1999 · 3 songs

Telugu

మీసమున్న  నేస్తమా  నీకు  రోషమెక్కువ   
మీసమున్న  నేస్తమా  నీకు  రోషమెక్కువ  
రోషమున్న  నేస్తమా  నీకు  కోపమెక్కువ  
కోపమెక్కువ  కానీ  మనసు  మక్కువ
  
స్నేహానికి  చెలికాడా  దోస్తీకి  సరిజోడ  
ఎల్లేదిగిన  పసివాడా  ఎన్నటికీ  నిను  వీడ 
మీసమున్న  నేస్తమా  హోయ్ 

ఏటిగట్టు  చెబుతుంది  అడుగు  మన  చేప  వేట  కధలు   
మర్రి  చెట్టు  చెబుతుంది  పంచుకొని  తిన్న  సద్ది  రుచులు   
చెరుకు  తోట  చెబుతుంది  అడుగు  ఆనాటి  చిలిపి  పనులు   
టెంట్  హాల్  చెబుతుంది  ఎన్టీఆర్  స్టంట్  బొమ్మ  కధలు
    
పరుగెడుతూ  పడిపోతూ  ఆ  నూతుల్లో  ఈత  కొడుతూ  
ఎన్నెల్లో  గడిచాయి  ఆ  గురుతులనే  విడిచాయి 
వయసెంత  మరచి  కేరింతలడే  ఆ  తీపి  జ్ఞాపకాలు   
కలకాలం  మనతోటె  వెన్నంటే  ఉంటాయి   
మనలాగే  అవి  కూడా  విడిపోలేనంటాయి
  
మీసమున్న  నేస్తమా  నీకు  రోషమెక్కువ  
రోషమున్న  నేస్తమా  నీకు  కోపమెక్కువ 

ఒక్క  తల్లి  సంతానమైన  మనలాగా  వుండగలరా   
ఒకరు  కాదు  మనం  ఇద్దరంటే  ఎవరైనా  నమ్మగలరా 
నువ్వు  పెంచిన  పిల్ల  పాపాలకు  కన్నా  తండ్రినైనా  
ప్రేమ  పంచిన  తీరులోన  నే  నిన్ను  మించగలన  

ఏ  పుణ్యం  చేసానో  నే  నీ  స్నేహం  పొందాను  
నా  ప్రాణం  నీదైన  నీ  చెలిమి  ఋణం  తీరేనా 
నీకు  సేవ  చేసేందుకైనా  మరు  జన్మ  కోరుకొన
స్నేహానికి  చెలికాడా  దోస్తీకి  సరిజోడ 
ఎల్లేదిగిన  పసివాడా  ఎన్నటికీ  నిను  వీడ
   
మీసమున్న  నేస్తమా  నీకు  రోషమెక్కువ  
రోషమున్న  నేస్తమా  నీకు  కోపమెక్కువ
కోపమెక్కువ  కానీ  మనసు  మక్కువ  

స్నేహానికి  చెలికాడా  దోస్తీకి  సరిజోడ  
ఎల్లేదిగిన  పసివాడా  ఎన్నటికీ  నిను  వీడ

English

Meesamunna Nesthama Neeku Roshamekkuva 
Meesamunna Nesthama Neeku Roshamekkuva 
Roshamunna Nesthama Neeku Kopamekkuva 
Kopamekkuva Kaani Manasu Makkuva 

Snehaniki Chelikaada Dosti Ki Sarijoda 
Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda 
Meesamunna Nesthama Hoi

Yetigattu Chebuthundhi Adugu Mana Chepa Veta Kadhalu 
Marri Chettu Chebuthundhi Panchukoni Thinna Saddhi Ruchulu 
Cheruku Thota Chebuthundhi Adugu Aanaati Chilipi Panulu 
Tent-hall Chebuthundhi Ntr Stunt Bomma Kadhalu 

Parugeduthu Padipothu Aa Noothullo Eetha Koduthu 
Yennello Gadichayi Aa Guruthulane Vidichayi
Vayasantha Marachi Kerinthalade Aa Theepi Gnapakalu 
Kalakaalam Manathote Vennante Vuntayi 
Manalage Avi Kooda Vidipolenantayi 

Meesamunna Nesthama Neeku Roshamekkuva 
Roshamunna Nesthama Neeku Kopamekkuva 

Okka Thalli Santhanamaina Manalaaga Vundagalara 
Okaru Kaadhu Manam Iddharante Yevaraina Nammagalara
Nuvvu Penchina Pilla Papalaku Kanna Thandrinaina 
Prema Panchina Theerulona Ne Ninnu Minchagalana
 
Ye Punyam Chesano Ne Nee Sneham Pondhanu 
Naa Pranam Needhaina Nee Chelimi Runam Theerena
Neeku Seva Chesendhukaina Maru Janma Korukona 
Snehaniki Chelikaada Dosti Ki Sarijoda 
Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda 

Meesamunna Nesthama Neeku Roshamekkuva 
Roshamunna Nesthama Neeku Kopamekkuva 
Kopamekkuva Kaani Manasu Makkuva 

Snehaniki Chelikaada Dosti Ki Sarijoda 
Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda

Community

Like, share, and discuss

to start a discussion.