Back to Lyrics
Sampangi

Sampangi

2001 · 4 songs

Telugu

గుండెనేందుకిచ్చావురా  దేవుడా 
ఎండమావి  చేసావురా  దేవుడా 
అమృతమంటి  ప్రేమను  కురిపిస్తావు 
మరు  నిముషంలో  విషముగా  మరిగిస్తావు 

గుండెనెందుకిచ్చావురా  దేవుడా 

మనసు  మనసుతో  ముడివేసి  మౌన  ప్రేమతో  పెనవేసి 
ఒకరినొకరిగా  తోడును  చేస్తావు 
ఒకరి  నీడలో  ఒకరిని  చూస్తావు 
వలపు  దీపాలు  వెలిగించి  
వేళా  వెన్నెలలు  కురిపించి 
కళల  కాలాన్ని  కరిగించేస్తావు 
శిలకు  ప్రాణాలు  నువ్వే  పోస్తావు 

ఆడినంతసేపడుకొని  బొమ్మలన్నీ  విసిరేస్తావు 
ఊహ  తెలియని  పసిపాపై  బొమ్మరిల్లు  తన్నేస్తావు 
ఏమాయ  తెలియని  పసి  హృదయాలను  తలో  దిక్కుగా  విసిరికొడతావు 

గుండెనెందుకిచ్చావురా  దేవుడా 

ఎదను  గుడిలాగా  మార్చేసి 
ఎదుట  దేవతను  చూపించి 
ప్రేమ  పూజలే  జరిపించేస్తావు 
వింత  మాయలో  పడదోసేస్తావు 
బ్రతుకు  హారతిగా  వెలిగించి 
వెతల  పాత్రలో  కరిగించి 
వెలుగు  రేఖలను  నిలువునా  కోస్తావు 
విలువ  చీకటిగా  మిగిలించేస్తావు  

నిండు  ప్రాణాలు  కదిలిపోతుంటే  కన్నె  నీటితో  కాల్చేవు 
బండరాయిలా  నువ్వుంటావు  కనుకనే  బాధపడలేవు 
ఈ  మాయలన్ని  ఇక  నీకే  తెలుసని  మనిషిని  పట్టుకు  వేధిస్తావు 

గుండెనేందుకిచ్చావురా  దేవుడా 
ఎండమావి  చేసావురా  దేవుడా 
అమృతమంటి  ప్రేమను  కురిపిస్తావు 
మరు  నిముషంలో  విషముగా  మరిగిస్తావు 

గుండెనెందుకిచ్చావురా  దేవుడా

English

Gundenendukichavura devuda
Yendamaavi chesavuraa devuda
Amruthamantee premanu kuripisthavu
Maru nimushamlo vishamuga marigisthavu

Gundenendukichavura devuda

Manasu manasutho mudivesi mouna prematho penvesi
Okarinokarigaa thodunu chesthavu
Okari needalo okarini chusthavu
Valapu deepalu veliginchi
Vela vennelalu kuripinchi
Kalala kaalaanni kariginchesthavu
Silaku pranalu nuvve posthavu

Aadinanthasepadukoni bommalanni visiresthavu
Uha theliyani pasipaapai bommarillu thannesthavu
Yemaya theliyani pasi hrudayaalanu thalo dikkuga visirikodathavu

Gundenendukichavura devuda

Yedanu gudilaaga maarchesi
Yeduta devathanu chupinchi
Prema pujale jaripinchesthavu
Vintha maayalo padadosesthavu
Brathuku haarathiga veliginchi
Vethala paathralo kariginhi
Velugu rekhalanu niluvuna kosthavu
Viluva cheekatiga migilinchesthavu

Nindu pranalu kadilipothunte kanne neetitho kaalchevu
Bandaraayilaa nuvvuntavu kanukane baadhapadalevu
Ee maayalanni ika neeke thelusani manishini pattuku vedhisthavu

Gundenendukichavura devuda
Yendamaavi chesavuraa devuda
Amruthamantee premanu kuripisthavu
Maru nimushamlo vishamuga marigisthavu

Gundenendukichavura devuda

Community

Like, share, and discuss

to start a discussion.