Back to Lyrics

Salute

2008 · 1 song

Telugu

నిన్నేనా  నేను  చూస్తోంది  నిన్నేనా
నువ్వేనా  నువ్వులా  ఉన్న  ఎవరోనా

కోపంలో  నిప్పుల  కొండలా
రూపంలో  చుక్కల  దండలా
నవ్వుల్లో  చిలకమ్మలా
చిన్నారుల  చేతికి  బొమ్మలా

ఇంతకీ  నువ్  ఒకడివా  వందవా
ఎంతకీ  నువ్వెవరికీ  అందవా

కొత్తగా  లవ్ లో  పడుతుంటె
కొద్దిగా  ఇదిలా  ఉంటుందే
ముందుగా  మనసుకి  తెలిసుందే
ముందుకే  నెడుతూ  ఉంటుందే

తప్పు  కాబోలనుకుంటూనె
తప్పుకోలేననుకుంటుందే
నొప్పిలో  తీపి  కలుస్తుందే
రెప్పలో  రేపు  కురుస్తుందే

నిన్నేనా  నేను  చూస్తోంది  నిన్నేనా
నువ్వేనా  నువ్వులా  ఉన్న  ఎవరోనా

కోపంలో  నిప్పుల  కొండలా
రూపంలో  చుక్కల  దండలా
నవ్వుల్లో  చిలకమ్మలా
చిన్నారుల  చేతికి  బొమ్మలా

ఇంతకీ  నువ్  ఒకడివా  వందవా
ఎంతకీ  నువ్వెవరికీ  అందవా

తడవక  నడిపే  గొడుగనుకోనా
అడుగుల  సడిలో  పిడుగైనా
మగతను  పెంచే  మగతనమున్నా
మునివనిపించే  బిగువేనా

ముళ్లలా  నీ  కళ్లలా  నను  గిల్లిపోతున్నవా
పువ్వులా  నా  సున్నితాన్నే  కాపు  కాస్తున్నవా 
నాకేమవుతావో  చెప్పవ  ఇపుడైన

చెప్పమని  అడిగేం  లాభంలే
ఎప్పుడో  పొందిన  ఆన్సర్లే
ఉత్తినే  వేసే  కొశ్చన్లే
ఊరికే  తీసే  ఆరాలే

నిదర  చెడగొట్టె  నేరాలై
కుదురుగ  ఉంచని  తొందరలే
దరిమిల  అంతా  నీ  వల్లె
అంటు  నిలదీసే  నిందల్లే

నిన్నేనా  నేను  చూస్తోంది  నిన్నేనా
నువ్వేనా  నువ్వులా  ఉన్న  ఎవరోనా

బిత్తరపోయే  బెదురొదిలించు
కొత్తగ  తెగువే  కలిగించు
కత్తెర  పదునై  బిడియము  తెంచు
అత్తరు  సుడివై  నను  ముంచు

చెంప  కుట్టె  తేనె  పట్టై  ముద్దులే  తరమనీ
చమట  పుట్టే  పరుగు  పెట్టి  హద్దులే  కరగనీ
అని  అడగాలన్నా  అడిగేయలేకున్న 

చెప్పమని  అడిగేం  లాభంలే
ఎప్పుడో  పొందిన  ఆన్సర్లే
ఉత్తినే  వేసే  కొశ్చన్లే
ఊరికే  తీసే  ఆరాలే

నిదర  చెడగొట్టె  నేరాలై
కుదురుగ  ఉంచని  తొందరలే
దరిమిల  అంతా  నీ  వల్లె
అంటు  నిలదీసే  నిందల్లే

నిన్నేనా  నేను  చూస్తోంది  నిన్నేనా
నువ్వేనా  నువ్వులా  ఉన్న  ఎవరోనా

కోపంలో  నిప్పుల  కొండలా
రూపంలో  చుక్కల  దండలా
నవ్వుల్లో  చిలకమ్మలా
చిన్నారుల  చేతికి  బొమ్మలా

ఇంతకీ  నువ్  ఒకడివా  వందవా
ఎంతకీ  నువ్వెవరికీ  అందవా
ఇంతకీ  నువ్  ఒకడివా  వందవా
ఎంతకీ  నువ్వెవరికీ  అందవా

English

Ninnena nenu chustondi ninnena
Nuvvena nuvvu la unna evarona

Kopam lo nippula kondala
Roopam lo chukkala dandala
Navvullo chilakammala
Chinnarula chetiki bommala

Intaki nuv okadiva vandava
Entaki nuv evariki andava

Kottaga love lo padtunte
Koddiga idhila untunde
Munduga manasuki telisunte
Munduke nedutu untunde

Tappu kabolanukuntune
Tappukolenanukuntunde
Noppi lo teepi kalustunde
Reppa lo repu kurustundi

Ninnena nenu chustondi ninnena
Nuvvena nuvvu la unna evarona

Kopam lo nippula kondala
Roopam lo chukkala dandala
Navvullo chilakammala
Chinnarula chetiki bommala

Intaki nuv okadiva vandava
Entaki nuv evariki andava

Tadavaka nadipe goduganukona
Adugula sadilo pidugaina
Magatanipinche magatanamunna
Munivanipinche biguvena

Mullala nee kallala
Nannu gilli potunnava
Puvvula na sunnitanne
Kaapu kastunnava
Nakemavtavo cheppava ipudaina

Cheppamani adigem labhamle
Eppudo pondina answerule
Utthine vese questionle
Oorike teese aarale

Nidura chedagotte neraale
Kuduruga unchani tondarale
Daramila antha nee valle
Antu niladeese nindalle

Ninnena nenu chustondi ninnena
Nuvvena nuvvu la unna evarona

Bittarapoye bedurodilinchu
Kottaga teguve kaliginchu
Kattera padunai bidayamu tenchu
Attaru sudivai nanu munchu

Champa kutte tene pattai
Muddule taramani
Chamata putte parugu petti
Haddule karagani
Ani adagalanna adigeylekunna

Cheppamani adigem labhamle
Eppudo pondina answerule
Utthine vese questionle
Oorike teese aarale

Nidura chedagotte neraale
Kuduruga unchani tondarale
Daramila antha nee valle
Antu niladeese nindalle

Ninnena nenu chustondi ninnena
Nuvvena nuvvu la unna evarona

Kopam lo nippula kondala
Roopam lo chukkala dandala
Navvullo chilakammala
Chinnarula chetiki bommala

Intaki nuv okadiva vandava
Entaki nuv evariki andava
Intaki nuv okadiva vandava
Entaki nuv evariki andava

Community

Like, share, and discuss

to start a discussion.