Back to Lyrics
Ranga Ranga Vaibhavanga

Ranga Ranga Vaibhavanga

2022 · 2 songs

Telugu

తెలుసా  తెలుసా
ఎవ్వరికోసం  ఎవ్వరు  పుడతారో
ఎవరికి  ఎవరేమి  అవుతారో

తెలుసా  తెలుసా
ఈ  హృదయాలకు  ఏ  కథ  రాసుందో
ఎవ్వరు  చదవని  కధనం  ఏముందో

ఆడే  పాడే  వయసులలో
ముడే  పడే  ఓ  రెండు  మనసులు
పాలు  నీళ్ళు  వీళ్ళ  పోలికలు
వేరే  చేసి  చూసే  వీల్లేదంటారు

తెలుసా  తెలుసా
ఎవ్వరికోసం  ఎవ్వరు  పుడతారో
ఎవరికి  ఎవరేమి  అవుతారో

కలిసే  ఉంటున్నా  కలవని  కన్నుల్లా
కనిపిస్తూ  ఉన్నా  కలలే  ఒకటంటా
పగలు  రాతిరిలా  పక్కనే  ఉంటున్నా
వీళ్ళే  కలిసుండే  రోజే  రాదంటా

తెలుసా  తెలుసా
ఆ  ఉప్పూ  నిప్పులకన్నా
చిటపటలాడే  కోపాలే  వీల్లేనన్నా

ఒకరిని  ఒకరు  మక్కువగా
తక్కువగా  చూసి  పోటీ  పెట్టావో
మరి  వీళ్ళకు  సాటే  ఎవరూ  రారంటా

తెలుసా  తెలుసా
ఎవ్వరి  కోసం  ఎవ్వరు  పుడతారో
ఎవరికి  ఎవరేమి  అవుతారో

చుట్టూ  తారల్లా  చుట్టాలుంటున్నా
భూమి  చంద్రుల్లా  వీళ్ళే  వేరంటా
ముచ్చపు  హారంలో  రాయే  రత్నంలా
ఎందరిలో  ఉన్నా  అస్సలు  కలవరుగా

ఎదురెదురుండే  ఆ  తూర్పు  పడమరలైన
ఏదో  రోజు  ఒకటయ్యే  వీలుందంటా
పక్కనే  ఉన్నా  కలిసెల్లే  దారొకటే  అయినా
కానీ  ఏ  నిమిషం  ఒక్కటిగా
పడని  అడుగులు  వీళ్ళంటా

తెలుసా  తెలుసా
ఎవ్వరి  కోసం  ఎవ్వరు  పుడతారో
ఎవరికి  ఎవరేమి  అవుతారో

తెలుసా  తెలుసా
ఈ  హృదయాలకు  ఏ  కథ  రాసుందో
ఎవ్వరు  చదవని  కధనం  ఏముందో

English

Telusaa Telusaa
Evvarikosam Evvaru Pudathaaro
Evariki Evaremi Avuthaaro

Telusaa Telusaa
Ee Hrudayaalaku Ye Katha Raasundho
Evvaru Chadavani Kadhanam Emundho

Aade Paade Vayasulalo
Mude Pade O Rendu Manasulu
Paalu Neellu Veella Polikalu
Vere Chesi Choose Veelledhantaaru

Telusaa Telusaa
Evvarikosam Evvaru Pudathaaro
Evariki Evaremi Avuthaaro

Kalise Untunna Kalavani Kannullaa
Kanipisthu Unna Kalale Okatanta
Pagalu Raathirila Pakkane Untunnaa
Veelle Kalisunde Roje Raadhantaa

Telusa Telusa
Aa Uppu Nippulakannaa
Chitapatalaade Kopaale Veellenannaa

Okarini Okaru Makkuvagaa
Thakkuvaga Choosi Poti Pettaavo
Mari Veellaku Saate Evaru Raarantaa

Telusaa Telusaa
Evvarikosam Evvaru Pudathaaro
Evariki Evaremi Avuthaaro

Chuttu Taarallaa Chuttaaluntunnaa
Bhoomi Chandrulla Veelle Verantaa
Muchhapu Haaramlo Raaye Rathnamlaa
Endarilo Unnaa Assalu Kalavarugaa

Edhuredhurunde Aa Thoorpu Padamaralaina
Edho Roju Okatayye Veelundhantaa
Pakkane Unna Kaliselle Daarokate Ayinaa
Kaani Ye Nimisham Okkatigaa
Padani Adugulu Veellantaa

Telusaa Telusaa
Evvarikosam Evvaru Pudathaaro
Evariki Evaremi Avuthaaro

Telusaa Telusaa
Ee Hrudayaalaku Ye Katha Raasundho
Evvaru Chadavani Kadhanam Emundho

Community

Like, share, and discuss

to start a discussion.