Back to Lyrics
Needi Naadi Oke Katha

Needi Naadi Oke Katha

2018 · 1 song

Singer

Telugu

నాలోని  నువ్వు  నీలోని  నేను
నవ్వేటి  కన్నుల్లో  
కలలైనామూ  కథలైనామూ

ఊగే  ఈ  గాలి  పూసే  ఆ  తోట
మనమంతా  నేడు  
ఒకటైనామూ  ఒకటైనామూ

ఆ  సీతాకోకలు  ఈ  మంచు  కోనలు
నినునన్ను  కలిపేటి  నీలాల  సిరులు
ఆ  చేదు  కాలం  మారింది  నేడు
చెరసాల  బాధ  పోతుంది  చూడు

పొడిసే  పొద్దు  ఎగసే  ఆనందం
శాశ్వత  హోమం  కాదిక  నా  దేహం
చెలియా  నా  ఊపిరి  వచ్చెనుగా  తిరిగి
పక్షుల  గొంతుల్లో  పాటను  నేనిపుడు

నాలోని  నువ్వు  నీలోని  నేను
మోసేటి  నేలకు  
కనులైనామూ  కనులైనామూ

హా  హా  హా  హా  హా  హా  హా

నీటిలొ  ఈదే  చేపకు  ఎపుడైనా
దాహం  వేస్తుందా  తెలుసా  నీకైనా
నింగిలొ  ఎగిరే  కొంగకు  ఎపుడైనా
మలినం  అంటేనా  తెలుసా  నీకైనా

లోయలు  ఎన్నున్నా  లోకం  ఏమన్నా
శోకం  ఎంతున్నా  కాలం  ఆగేనా
ఎవరూ  ఏమన్నా
ఏ  తోడు  లేకున్నా  నీడై  నేనుంటా

పలికే  ఆ  చిలుక  నవ్వే  నెలవంక
ఎగిరే  పిచ్చుకల  స్వేచ్ఛే  మాదింక
ఏలే  భువనాన  గెలిచిన  జత  మాది
మాలా  మేమంటే  బ్రతుకే  ముద్దంటా

నాలోని  నువ్వు  నీలోని  నేను
మోసేటి  నేలకు  కనులైనామూ

English

Naaloni Nuvvu Neeloni Nenu
Navveti Kannullo 
Kalalainamu Kathalainamu

Uuge Gaali Poose Aa Thota
Manamanta Nedu 
Okatainamu Okatainamu

Aa Seetakokalu Ee Manchu Konalu
Ninu Nannu Kalipeti Neelaala Sirulu
Aa Chedhu Kaalam Maarindi Nedu
Cherasala Badha Pothundhi Chudu

Podise Aa Poddhu Yegase Aanandam
Shaswatha Homam Kaadika Naa Deeham
Cheliyaa Naa Upiri Vachenuga Thirigi
Pakshula Gontullo Patanu Nenipudu

Naaloni Nuvvu Neeloni Nenu
Moseti Nelaku 
Kanulainamu Kanulainamu

Neetilo Ede Chepaku Yepudaina
Daham Vesthunda Telusaa Neekaina
Ningilo Egire Kongaku Yepudaina
Malinam Antena Telusaa Neekaina

Loyalu Ennunna Lokam Emanna
Sokam Enthunna Kaalam Aagena
Evaru Emanna Ye Thodu Lekunna
Needai Nenuntaa

Palike Aa Chilukaa Navve Nelavanka
Egire Pichukala Sweche Naadinka
Yele Bhuvananaa Gelichina Jatha Maadi
Maala Memunte Brathuke Muddantaa

Naaloni Nuvvu Neeloni Nenu
Moseti Nelaku Kanulainamu

Community

Like, share, and discuss

to start a discussion.