Back to Lyrics
Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari

1990 · 2 songs

Telugu

అమ్మాయి  అచ్చ  తెలుగు  సాంప్రదాయ  సుందరి
సౌభాగ్య  లక్ష్మి  పోలిక
అబ్బాయి  మాటకారి  మోహనాంగుడే  మరి
తానున్న  చోటే  వేడుక

చూసేటి  కళ్ళకెంత  చూడ  ముచ్చట
ముద్దైనా  జంట  విరట
ప్రేమన్న  ఊహ  కూడా  లేదు  ఇచ్చట
ఉందల్లా  స్నేహమేనట

జత  గువ్వలై  రివ్వు  రివ్వున
కోన  సాగింది  ఇరువురి  పరిచయం

భల్లే  భల్లే  భల్లే  భల్లే  బాగుందిలే
ఈ  రెండు  మనసుల  కూడిక
మాయే  చేసిందిలే  మంత్రం  వేసిందిలే
మలయాళ  కేరళ  వేదిక

ఓ  మాట  చాలదా  తియ్య  తియ్యగా
ఏకాంతమే  దరి  రాదు  కదా
మోమాటమొదిలితే  కాస్త  చనువుగా
మనసు  మనసును  ఆక్రమించదా

ఏ  రుచి  అభిరుచి  ఏమి  కలిసేనో
కొబ్బరి  గాలుల  వాలుగా
ఏమది  ఎదురుగా  ఏమి  చదివేనో
సమయాలు  వెలిగాయి  సరదాలుగా

భల్లే  భల్లే  భల్లే  భల్లే  బాగుందిలే
ఈ  రెండు  మనసుల  కూడిక
మాయే  చేసిందిలే  మంత్రం  వేసిందిలే
మలయాళ  కేరళ  వేదిక

గడియారం  చూసుకొని  కాలక్షేపమే
గడియైన  విడిపోనే  పోదట
జరిగింది  అందమైన  ఇంద్రజాలమే
దైవికమైన  అనుభందమేనట

నిన్నల్లో  కలిసిన  వారువీరిక  
వారే  వీరైనారట
ఎవరు  ఎవరో  పోల్చలేమిక  
అంతగా  ఒకటైపోయారట

భల్లే  భల్లే  భల్లే  భల్లే  బాగుందిలే
ఈ  రెండు  మనసుల  కూడిక
మాయే  చేసిందిలే  మంత్రం  వేసిందిలే
మలయాళ  కేరళ  వేదిక

భల్లే  భల్లే  భల్లే  భల్లే  బాగుందిలే
భల్లే  భల్లే  భల్లే  భల్లే  బాగుందిలే
భల్లే  భల్లే  భల్లే  భల్లే  బాగుందిలే
భల్లే  భల్లే  భల్లే  భల్లే  బాగుందిలే

English

Ammaayi achcha Telugu saampraadaaya sundari
Saubhaagya Lakshmi polika
Abbaayi maatakaari mohanaangude mari
Thaanunna chote veduka

Chooseti kallakentha chooda muchchata
Muddainaa janta virata
Premanna ooha kooda ledu ichchata
Undallaa snehame nata

Jatha guvvalai rivvu rivvuna
Kona saagindi iruvuri parichayam

Bhalle bhalle bhalle bhalle baagundile
Ee rendu manasula koodika
Maaye chesindile mantram vesindile
Malayala Kerala vedika

O maata chaaladaa thiyya thiyyagaa
Ekaanthame dari raadu kadaa
Momaatamodilithe kaastha chanuvugaa
Manasu manasunu aakraminchadaa

Ae ruchi abhiruchi emi kaliseno
Kobbari gaalula vaalugaa
Emadi edurugaa emi chadiveno
Samayaalu veligaayi saradaalugaa

Bhalle bhalle bhalle bhalle baagundile
Ee rendu manasula koodika
Maaye chesindile mantram vesindile
Malayala Kerala vedika

Gadiyaaram choosukoni kaalakshepame
Gadiyaina vidipone porata
Jarigindi andamaina indrajaalame
Daivikamaina anubandhamenata

Ninnallo kalisina vaaruveerik 
Vaare veerainaarata
Evaru evaro polchalemika 
Anthagaa okataipoyaarata

Bhalle bhalle bhalle bhalle baagundile
Ee rendu manasula koodika
Maaye chesindile mantram vesindile
Malayala Kerala vedika

Bhalle bhalle bhalle bhalle baagundile
Bhalle bhalle bhalle bhalle baagundile
Bhalle bhalle bhalle bhalle baagundile
Bhalle bhalle bhalle bhalle baagundile

Community

Like, share, and discuss

to start a discussion.