Back to Lyrics

Matrudevobhava

1993 · 2 songs

Telugu

రాలిపోయే  పువ్వా  నీకు  రాగాలెందుకే 
తోటమాలి  నీ  తోడు  లేడు  లే 
వాలిపోయే  పోద్దా  నీకు  వర్ణాలెందుకే 
లోకమెన్నడో  చీకటాయెలే
 
నీకిది  తెల్లవారని  రెయమ్మ 
కలికి  మా  చిలక  పాడకు  నిన్నటి  నీ  రాగం 

రాలిపోయే  పువ్వా  నీకు  రాగాలెందుకే 
తోటమాలి  నీ  తోడు  లేడు  లే 
వాలిపోయే  పోద్దా  నీకు  వర్ణాలెందుకే 
లోకమెన్నడో  చీకటాయెలే

చెదిరింది  నీ  గూడు  గాలిగా 
చిలక  గోరింకమ్మ  గాధగా 
చిన్నారి  రూపాలు  కన్నీటి  దీపాలు  కాగా 

తనవాడు  తారల్లో  చేరగా 
మనసు  మాంగల్యాలు  జారగ 
సింధుర  వర్ణాలు  తెల్లారి  చల్లారిపోగా 

తిరిగే  భూమాతవు  నీవై 
వేకువలో  వెన్నెలవై 
కరిగే  కర్పూరము  నీవై 
ఆశలకే  హారతివై

రాలిపోయే  పువ్వా  నీకు  రాగాలెందుకే 
తోటమాలి  నీ  తోడు  లేడు  లే 
వాలిపోయే  పోద్దా  నీకు  వర్ణాలెందుకే 
లోకమెన్నడో  చీకటాయెలే

అనుబంధమంటేనే  అప్పులే 
కరిగే  బంధాలన్నీ  మబ్బులే 
హేమంత  రాగాల  చేమంతులే  వాడిపోయే 

తన  రంగు  మార్చింది  రక్తమే 
తనతో  రాలేనంది  పాశమే 
దీపాల  పండక్కి  దీపాలే  కొండెక్కిపోయే
 
పగిలే  ఆకాశం  నీవై 
జారిపడే  జాబిలివై 
మిగిలే  ఆలాపన  నీవై 
తీగ  తెగే వీణియవై 

రాలిపోయే  పువ్వా  నీకు  రాగాలెందుకే 
తోటమాలి  నీ  తోడు  లేడు  లే 
వాలిపోయే  పోద్దా  నీకు  వర్ణాలెందుకే 
లోకమెన్నడో  చీకటాయెలే

English

Raalipoye puvva neeku raagalenduke
Thotamaali nee todu ledu le
Vaalipoye podda neeku varnaalenduke
Lokamennado cheekatayele

Neekidi tellavaarani reyamma
Kaliki ma chilaka paadaku ninnati nee raagam

Raalipoye puvva neeku raagalenduke
Thotamaali nee todu ledu le
Vaalipoye podda neeku varnaalenduke
Lokamennado cheekatayele

Chedirindi nee guudu gaaliga
Chilaka gorinkamma gaadhaga
Chinnari roopalu kanneti deepaalu kaagaa

Tanavaadu taarallo cheraga
Manasu maangalyaalu jaaraga
Sindhuura varnaalu tellari challaripogaa

Tirige bhuumaatavu neevai
Vekuva lo vennelavai
Karige karpuuramu neevai
Aasalake haarativai

Raalipoye puvva neeku raagalenduke
Thotamaali nee todu ledu le
Vaalipoye podda neeku varnaalenduke
Lokamennado cheekatayele

Anubandhamantene appule
Karige bandhaalanni mabbule
Hemanta raagaala chemantule vaadipoye

Tana rangu maarchindi raktame
Tanato raalenandi paasame
Deepaala pandakki deepaale kondekkipoye

Pagile aakasam neevai
Jaaripade jabilivai
Migile aalapana neevai
Teega tege veeniyavai

Raalipoye puvva neeku raagalenduke
Thotamaali nee todu ledu le
Vaalipoye podda neeku varnaalenduke
Lokamennado cheekatayele

Community

Like, share, and discuss

to start a discussion.