Back to Lyrics

Kudirithe Cup Coffee

2011 · 1 song

Telugu

శ్రీకారం  చుడుతున్నట్టు  కమ్మని  కలనాహ్వానిస్తూ 
నీ  కనులెటు  చూస్తున్నాయి  మాక్కూడా  చూపించమ్మా 
ప్రాకారం  కడుతున్నట్టు  రాబోయే  పండగ  చుట్టూ 
నీ  గుప్పిట  ఏదో  గుట్టు  దాక్కుందే  బంగారు  బొమ్మ

శ్రీకారం  చుడుతున్నట్టు  కమ్మని  కలనాహ్వానిస్తూ 
నీ  కనులెటు  చూస్తున్నాయి  మాక్కూడా  చూపించమ్మా 
ప్రాకారం  కడుతున్నట్టు  రాబోయే  పండగ  చుట్టూ 
నీ  గుప్పిట  ఏదో  గుట్టు  దాక్కుందే  బంగారు  బొమ్మ

జల  జల  జల  జాజుల  వాన  కిలకిలకిలా  కిన్నెర  వీణ 
మిలమిలమిన్నంచుల  పైన  మెలి  తిరిగిన  చంచలయాన 
మధురోహల  లాహిరిలోన  మదినుపే  మదిరవే  జానా 

నీ  నడకలు  నీవేనా  చూశావా  ఏనాడైనా 
నీ  మెత్తని  అడుగుల  కింద  పడి  నలిగిన  ప్రాణాలెన్నో 
గమనించవు  కాస్తైనా  నీ  వెనకలేమౌతున్న 
నీ  వీపుని  ముల్లై  గుచ్చే  కునుకెరుగని  చూపులు  ఎన్నో
 
లాస్యం  పుట్టిన  ఊరు  లావణ్యం  పెట్టని  పేరు 
లలన  తెలుసో  లేదో  నీకైనా  నీ  తీరు 

నీ  గాలే  సోకినా  వారు  గాలిబ్  గజలైపోతారు 
నీ  వేలే  తాకినా  వారు  నిలువెల్లా  వీనవుతారు 
కవితవో  యువతివో  ఎవతివో  గుర్తించేదెట్టాగామ్మ 

నక్షత్రాలేన్నంటూ  లెక్కెడితే  ఏమైనట్టు 
నీ  మనసుకు  రెక్కలు  కట్టు  చుక్కల్లో  విహరించేట్టు 
ఎక్కడ  నావెలుగంటూ  ఎప్పుడు  ఎదురొస్తుందంటూ   
చిక్కటి  చీకటినే  చూస్తూ  నిద్దురనే  వేలి  వేయోద్దు 

వేకువనే  లాక్కొచ్చేట్టు  వెన్నెలతో  దారం  కట్టు 
ఇదిగో  వచ్చానంటూ  తక్షణమే  హాజరయేట్టూ 

అందాకా  మారం  మని  జోకొట్టావే  ఆరాటాన్ని 
పొందిగ్గా  పడుకో  రాణి  జాగారం  ఎందుగ్గానీ   
నళినీవో  హారిణివో  తరుణివో  మురిపించే  ముద్దులగుమ్మ

English

Shreekaram chudutunnattu kammani kalanahavanistoo
Nee kanuletu choostunnayo maakkooda choopinchamma
Prakaaram kadutunnattu raboye pandaga chuttoo
Nee guppita yedo guttu dakkunde bangaru bomma

Shreekaram chudutunnattu kammani kalanahavanistoo
Nee kanuletu choostunnayo maakkooda choopinchamma
Prakaaram kadutunnattu raboye pandaga chuttoo
Nee guppita yedo guttu dakkunde bangaru bomma

Jala jala jala jaajula vana kilakilakila kinnaera veena
Milamilaminnamchula paina meli tirigina chanchalayaana
Madhurohala lahirilona madinoope madirave jana

Nee nadakalu neevaina chooshava enadaina
Nee metthani adugula kindha padi nalaigina pranalenno
Gamaninchavu kaastaina nee venakalemoutunna
Nee veepuni mullai guchhe kunukerugani choopulu yenno

Laasyam puttina ooru lavanyam pettani peru
Lalana teluso ledo neekaina nee teeru

Nee gale saokina varu gaalib gajalaipotaru
nee vele takina varu niluvella veenaoutaru
kavitavo yuvativo yevativo gurtinchedettagamma

Nakshatralennantoo lekkedite emainattu
Nee manasuku rekkalu kattu chukkallo viharinchettu
Yekkada navelugantoo yeppudu yedurostundntoo
Chikkati cheekatine choostoo niddurane veli veyaoddu

Vekuvane lakkochhettu vennelato darm kattu
Idigo vachhanntoo takshaname hajarayettoo

Andaka maram mani jokottave aratanni
Pondigga paduko rani jaagaram yendugganee
Nalinivo harinivo tarunivo muripinche muddulagumma

Community

Like, share, and discuss

to start a discussion.