Back to Lyrics
Krishnam Vande Jagadgurum

Krishnam Vande Jagadgurum

2012 · 3 songs

Telugu

అరెరే  పసి  మనసా  చేజారే  వరసా
చెబితే  వినవటె  వయసా
మరుపే  మొదటి  దిశ  అటుపై  దాని  దిశ
తెలుపదు  చిలిపి  తమాషా
తననొదిలి  ఎటువైపు  కను  కదలని  చూపు
నిను  మరచిన  తలపు  వినదిక  నీ  పిలుపు
ఊహ  విహారమా  సాగే  సరాగమా
సరదా  తగదు  సుమ  సుతారమా

పాపా  జాగ్రత్తే  పరాకుల్లో  పడతావే
పాపా  జాగ్రత్తే  పరాకుల్లో  పడతావే
చూస్తూ  చూస్తూనే  సుడిలో  దిగిపోతావే
అరెరే  పసి  మనసా  చేజారే  వరసా
చెబితే  వినవటె  వయసా
మరుపే  మొదటి  దిశ  అటుపై  దాని  దిశ
తెలుపదు  చిలిపి  తమాషా

అవునా  ఇతనేనా  ఇన్నాళ్ళు  ఎదురున్నది  కదా  మరి
అయినా  ఇంతకుముందు  ఏనాడు  పరిచయమైనా  లేనట్టుంది
ఎపుడు  ఇలాంటి  ఓ  మలుపు  ఈ  ప్రయాణంలో  కనిపించిందా
వయసుకు  ఇదే  మేలుకొలుపు  ఈ  ముహుర్తంలో  అనిపించిందా
కదిలే  ఒకో  క్షణం  నడిపే  మనోరధం
తెలిపే  కథా  క్రమం  ఏం  చెబుతాం

పాపా  జాగ్రత్తే  పరాకుల్లో  పడతావే
వద్దొద్దంటునే  పరాకుల్లో  పడుతున్నా
పాపా  జాగ్రత్తే  పరాకుల్లో  పడతావే
చూస్తూ  చూస్తూ  సుడిలో  దిగిపోతావే
అరెరే  పసి  మనసా  చేజారే  వరసా
చెబితే  వినవటె  వయసా
మరుపే  మొదటి  దిశ  అటుపై  దాని  దిశ
తెలుపదు  చిలిపి  తమాషా

అబలా  ఏమైపొతున్నవే  సుడిగాలిలో  చిగురాకులా
నువ్వలా  ఎప్పుడు  గుర్తిస్తావే  తరిమేదెవరో  నిలిపేదెపుడో
నీలో  ఇదే  కధ  మొదలు  ఈ  నిషాలయలు  గమనించవా
లోలో  అదోలాంటి  గుబులు  ఎందుకో  అసలు  కనిపెట్టవా
ఏదో  అయోమయం  అయినా  మహా  ప్రియం
దాన్నే  కదా  మనం  ప్రేమంటాం

English

Arere pasi manasa chejare varasa
chebithe vinavate vayasaa
marupe modati diasha atupai daani disha
thelupadhu chilipi tamashaa
thananodhili etuvaipu kanu kadhalani choopu
ninu marachina thapalupu vinadhika nee pilupu
ooha viharama saage saragama
sarada thagadu suma sutharama

Papa jagartthe parakullo padathave
papa jagartthe parakullo padathave
choosthu choosthune sudilo digipothave
arere pasi manasa chejare varasa
chebithe vinavate vayasa
marupe modati diasha atupai daani disha
thelupadhu chilipi tamasha

Avuna ithanena innallu yedhurunnadhi kadha mari
ayina inthakumundhu enadu paichayamayina lenattundhi
yepudu ilanti o malupu ee prayanamlo kanipinchindha
vayasuku idhe melukolupu ee muhurthamlo anipinchindha
kadhile oko kshanam nadipe manoradham
thelipi katha kramam em chebutham

Papa jagartthe parakullo padathave
vadhodhantune parakullo paduthunna
papa jagartthe parakullo padathave
choosthu choosthu sudilo digipothave
arere pasi manasa chejare varasa
chebithe vinavate vayasa
marupe modati diasha atupai daani disha
thelupadhu chilipi tamasha

Abala evaipothunnave sudigalilo chigurakula
nuvvala yeppudu gurthisthave tharimedhevaro nilipedepudo
neelo idhe kadha modhalu ee nisha layalu gmaninchava
lolo adholanti gubulu endhuko asalu kanipettava
yedho ayomayam ayina maha priyam
dhanne kadha manam premantam

Community

Like, share, and discuss

to start a discussion.