Back to Lyrics

Kondaveti Simham

1981 · 1 song

Telugu

ఈ  మధుమాసంలో  ఈ  దరహాసంలో 
మదిలో  కదిలి  పలికే  కోయిలా 
బ్రతుకే  హాయిగా 

ఈ  మధుమాసంలో  ఈ  దరహాసంలో 
మదిలో  కదిలి  పలికే  కోయిలా 
బ్రతుకే  హాయిగా 

ఆకాశం  అంచులు  దాటి  ఆవేశం  నాగీతం 
ఆందులోని  ప్రతి  అక్షరము  అందమైన  నక్షత్రం 
ఆ  గీతం  పలికిన  నా  జీవితమే  సంగీతం 
సంగమించే  ప్రణయంలో  ఉదయరాగా  సింధూరం 

ప్రేమేపెన్నిధిగా  దైవం  సన్నిధిగా 
ప్రేమేపెన్నిదిగా  దైవం  సన్నిధిగా 

సంసృతిలో  జతకలిసి 
ప్రియలయలో  ఆదమరిచి 
అనురాగాలు  పలికించు  వేళా 

ఈ  మధుమాసంలో  ఈ  దరహాసంలో 
మదిలో  కదిలి  పలికే  కోయిల 
బ్రతుకే  హాయిగా 

అందమైన  మన  ఇల్లు  అవని  మీద  హరివిల్లు 
ఋతువులెన్ని  మారిన  వసంతాలు  వెదజల్లు 
తెల్లవారిన  సంజెలలో  తేనెనీటి  వడగళ్ళు 
జ్ఞాపకాల  నీడలలో  కరుగుతున్న  కన్నీళ్లు 

ఒకటే  ఊపిరిగా  కలలే  చూపులుగా 
ఒకటే  ఊపిరిగా  కలలే  చూపులుగా 
మనసులలో  మనసెరిగి 
మమతాలనే  మధువొలికే 
శుభయోగాలు  తిలకించు  వేళా 

ఈ  మధుమాసంలో  ఈ  దరహాసంలో 
మదిలో  కదిలి  పలికే  కోయిలా 
బ్రతుకే  హాయిగా

English

Ee madhumaasamlo ee darahaasamlo
Madilo kadili palike koyila
Bratuke hayiga

Ee madhumaasamlo ee darahaasamlo
Madilo kadili palike koyila
Bratuke hayiga

Aakasham anchaulu date aavesham nageetam
Anduloni prati aksharamu andamaina nakshatram
A geetam palikina na jeevitame sangeetam
Sangaminchu pranayamlo udayaraga sindhooram

premepennidhiga daivam sannidhiga
Premepennidiga daivam sannidhiga

Samsrutilo jatakalisi
Priyalayalo adamarichi
Anuragalu palikinchu vela

Ee madhumaasamlo ee darahaasamlo
Madilo kadili palike koyila
Bratuke hayiga

Andamaina mana illu avani meeda harivillu
Rutuvulenni maarina vasantaalu vedajallu
Telavarina sanjelalo teneneeti vadagallu
Jnapakaala needalalo karugutunna kanneellu

Okate oopiriga kalale choopuluga
Okate oopiriga kalale choopuluga
Manasulalo manasaerigi
Mamatalane madhuvolike
Shubhayogalu tilakinchu vela

Ee madhumaasamlo ee darahaasamlo
Madilo kadili palike koyila
Bratuke hayiga

Community

Like, share, and discuss

to start a discussion.