Back to Lyrics
Kanche

Kanche

2015 · 5 songs

Telugu

భగ  భగమని  ఎగసిన  మంటలు  ఏ  కాంతి  కోసమో 
ధగ  ధగమని  మెరిసిన  కత్తులు  ఏ  శాంతి  కోసమో 
ఏ  పంటల  రక్షణకీ  కంచెలు  ముళ్ళు 
ఏ  బ్రతుకును  పెంచుటకీ  నెత్తుటి  జల్లు 
ఏ  స్నేహం  కోరవు  కయ్యాలా  కక్షలు 
ఏ  దాహం  తీర్చావు  ఈ  కారుచిచులు 
  
ప్రాణమే  పానమై  ఆడుతున్న  జూదం 
ఇవ్వదే  ఎపుడు  ఎవరికీ  ఎలాంటి  గెలుపు 
చావులో  విజయం  వెతుకు  ఈ  వినోదం 
పొందదే  ఎపుడు  మేలుగోలుపు  మేలుగెలుపు       
అంతరాలు  అంతమై  అంత  ఆనందమై 
కలసి  మెలిసి  మనగలిగే  కాలం  చెల్లిందా 
చెలిమి  చినుకు  కరువై  పగల  సెగలు  నెలవై 
ఎల్లలతో  పుడమి  వొళ్ళు  నిలువెల్లా  చీలింద 

నిశి  నిషేధ  కార్యోన్ముక్త  దురిత  శరాఘాతం 
మృదు -లాలస  స్వప్నాలస  హృద్ -కాపోతే  పాఠం 
వ్యధార్ధాల  పృథ్వీ  మాత  నిర్గోషిత  చేతం 
నిష్టుర  నిశ్వసంతో  నిస్చేష్టిత  గీతం 
ఏ  విష  బీజోద్భూతం  ఈ  విషాద  బీజం   

ప్రాణమే  పానమై  ఆడుతున్న  జూదం 
ఇవ్వదే  ఎపుడు  ఎవరికీ  ఎలాంటి  గెలుపు 
చావులో  విజయం  వెతుకు  ఈ  వినోదం  
పొందదే  ఎపుడు  మేలుగోలుపు  మేలుగెలుపు    
భగ  భగమని  ఎగసిన  మంటలు  ఏ  కాంతి  కోసమో 
ధగ  ధగమని  మెరిసిన  కత్తులు  ఏ  శాంతి  కోసమో

English

Bhaga bhagamani egasina mantalu ye kanthi kosamo
Dhaga dhagamani merisina katthulu ye shanthi kosamo
Ye pantala rakashankee kanchela mullu
Ye brathukunu penchutuakee netthuti jallu
Ye sneham koravu kayyala kahsalu
Ye daaham theerchavu ee kaaruchihculu

Praaname panamai aaduthunna joodam
Ivvadhe epudu evariki elanti gelupu
Chavulo vijayam vethuku ee vinodam
Pondhadhe epudu melugolupu melogolupu
Antharalu anthamai antha adandamai
Kalasi malisi managalige kaalam chellindha
Chelimi chinuku karuvai pagala segalu nelavai
Yellalatho pudami vollu niluvella cheelindha

Nishi nishada karonmuktha duritha sharagatham
Mrudu-lalasa swapnalasa hrud-kapotha paatham
Vyadhardhala pruthvi matha nirgoshitha chetham
Nishtura nishwsamtho nischeshtitha geetham
Ye visha beejodbhootam ee vishada bhujam

Praaname panamai aaduthunna joodam
Ivvadhe epudu evariki elanti gelupu
Chavulo vijayam vethuku ee vinodam
Pondhadhe epudu melugolupu melogolupu
Bhaga bhagamani egasina mantalu ye kanthi kosamo
Dhaga dhagamani merisina katthulu ye shanthi kosamo

Community

Like, share, and discuss

to start a discussion.