Back to Lyrics
Hello

Hello

2017 · 5 songs

Telugu

అనగనగ  ఒక  ఊరు 
అనుకోకుండా  ఒక  నాడు 
కలిసారే  పసివాళ్లు  స్నేహంగా 

సంతోషమంతా  రెక్కలుగా 
రివ్వంటూ  ఎగిరే  పక్షులుగా 
ఆకాశమంత  ఆటాడుకుంటూ 
ఉన్నారు  సరదాగా 

ఒకరేమో  శీను  ఒక్కరేమో  జున్ను 
కలిసారే  ప్రాణంగా 
కురిసారె  వర్షంగా     
పాటేమో  శీను  ఆటేమో  జున్ను 
ఒకటై  ఎదిగారే  మధురంగా  

ప్రపంచమంతా  తమ  ఇల్లంటూ 
ప్రతి  క్షణం  ఒక  పండుగగా 
కన్నీరు  లేని  కలలే  కంటూ 
చిన్నారి  చెలిమే   బలపడగా 

తీయ  తియ్యని  ఊసులతో 
తెల  తెల్లని  మనసులలో 
కథ  ఇలాగ  మొదలయ్యేగా 
కథ  ఇలాగ  మొదలయ్యేగా 

అనగనగ  ఒక   ఊరు 
అనుకోకుండా  ఒక  నాడు 
కలిసారే  పసివాళ్లు  స్నేహంగా 

ఎగిరిన  బుడకలలోన  చెలిమే 
ఉరికిన  పడవలలోన  చెలిమే 
రంగుల  రాట్నంలో  చెలిమే 
చిందులు  వేసిందే 
మిణుగురు  వెలుగులలోన  చెలిమే 
తొలకరి  తేనెలలోన  చెలిమే 
గాజుల  గలగాలలో  చెలిమే 
సందడి  చేసిందే 

ఈ  జ్ఞ్యాపకాలన్నీ  నిలిచెను  లే 
మీ  జీవితానికి  బలమై  నడిపెనులే 
ఈ  సాక్ష్యాలే   అనుబంధాల 
భవనానికి  స్తంభాలే   

అనగనగ  ఒక  ఊరు 
అనుకోకుండా ఒక నాడు 
కలిసారే  పసివాళ్లు  స్నేహంగా
 
తెలుపని  కబురులలోన  చెలిమే 
తిరగని  మలుపులలోన  చెలిమే 
దొరకని  చూపులలో  చెలిమే 
దోసిలి  నింపింది 
జరిగిన  నిమిషములోన  చెలిమే 
ఎరగని  మరు  నిమిషాన  చెలిమే 
కాలం  చెక్కిలిలో  చెలిమే 
చుక్కై  మెరిసిందే 
చిన్ననాడు  మురిపించే  ఈ  గురుతులే 
కానరాని  దారిని  చూపే  మీ  గురువులే 
ఉండాలంటూ  ఈ  బతుకంతా 
ఈ  మాటలకి  కట్టుబడే

English

Anaganaga oka uru
Anukokunda oka naadu
Kalisaare pasivallu snehanga

Santhoshamantha rekkaluga
Rivvantu yegire pakshuluga
Aakasamantha aataadukuntu
Unnaru saradhaga

Okaremo seenu okkaremo junnu
Kalisaare prananga
Kurisaare varshanga
Paatemo seenu aatemo junnu
Okatai yedhigaare madhuranga
 
Prapanchamantha thama illantu
Prathi kshanam oka pandugaga
Kanneeru leni kalale kantu
Chinnari chelime balapadaga

Thiya thiyyani oosulatho
Thela thellani manasulalo
Katha ilaaga modhalayyegaa
Katha ilaaga modhalayyegaa

Anaganaga oka ooru
Anukokunda oka naadu
Kalisaare pasivallu snehanga

Yegirina budakalalona chelime
Urikina padavalalona chelime
Rangula ratnamlo chelime
Chindhulu vesindhe
Minuguru velugulalona chelime
Tholakari thenelalona chelime
Gaajula galagalalo chelime
Sandhadi chesindhe

Ee gnyaapakaalanni nilechenu le
Mee jeevithaaniki balamai nadipenule
Ee saakshyale anubhandhala
Bhavanaaniki sthanbhaale

Anaganaga oka ooru
Anukokunda oka naadu
Kalisaare pasivallu snehanga

Thelapani kaburulalona chelime
Thiragani malupulalona chelime
Dhorakani choopulalo chelime
Dhosili nimpindhi
Jarigina nimishamulona chelime
Yeragani maru nimishana chelime
Kaalam chekkililo chelime
Chukkai merisindhe
Chinanaadu muripinche ee guruthule
Kanaraani dhaarini choope mee guruvule
Undaalantu ee bathukantha
Ee maatalaki kattubade

Community

Like, share, and discuss

to start a discussion.