Back to Lyrics
Gayam

Gayam

2006 · 3 songs

Telugu

సురాజ్యమవలేని  స్వరాజ్యమెందుకనీ 
సుఖాన  మనలేని  వికాసమెందుకని 
నిజాన్ని  బలి  కోరే  సమాజమెందుకని 
అడుగుతోంది  అదిగో  ఎగిరే  భారత  పతాకం 

ఆవేశంలో  ప్రతినిముషం  ఊరికే  నిప్పుల  జలపాతం 
కత్తికోనల  ఈ  వర్తమానమున  బ్రతకదు  శాంతి  కపోతం 
బంగారు  భవితకు  పునాది  కాగల  యువత  ప్రతాపాలు 
భస్మాసుర  హస్తాలే  ప్రగతికి  సమాధి  కడుతుంటే 
శిరసు  వంచేనదిగో  ఎగిరే  భారత  పతాకం 
చెరుగుతుంది  ఆ  తల్లి  చరితలో  విశ్వ  విజయాల  విభావం 

సురాజ్యమవలేని  స్వరాజ్యమెందుకనీ 
సుఖాన  మనలేని  వికాసమెందుకని 

కులమతాల  దావానలానికి  కరుగుతున్నది  మంచుశిఖరం 
కలహముల  హాలా  హలానికి  మరుగుతున్నది  హిందూసంద్రం 
దేశమంటే  మట్టికాదను  మాట  మరచెను  నేటి  విలయం 
అమ్మ  భారతి  బలిని  కోరిన  రాచకురుపీ  రాజకీయం 
విషము  చిమ్మెను  జాతి  తనువునా  ఈ  వికృత  గాయం

English

Suraajyamavaleni swaraajyamendukani
sukhaana manaleni vikaasamendukani
nijaanni bali kore samaajamendukani
aDugutondi adigo egire bharata pataakam

Aavesamlo pratinumusham urike nippula jalapaatam
kattikonala ee vartamaanamuna bratakadu saanti kapotam
bangaru bhavitaku punaadi kaagala yuvata prataapaalu
bhasmaasura hastaalai pragatiki samaadhi kadutunte
sirasu vanchenadigo egire bharata pataakam
cherugutundi aa talli charitalo viswa vijayaala vibhavam

Suraajyamavaleni swaraajyamendukani
sukhaana manaleni vikaasamendukani

Kulamataala davaanalaaniki karugutunnadi manchusikharam
kalahamula haalaa halaaniki marugutunnadi hindusandram
desamante mattikaadanu maata marachenu neti vilayam
amma bhaarati balini korina raachakurupee raajakeeyam
vishamu chimmenu jaati tanuvunaa ee vikruta gaayam

Community

Like, share, and discuss

to start a discussion.