Back to Lyrics

Donga Ramudu and Party

2003 · 2 songs

Singer
Lyricist

Telugu

చలిరాతిరి  వస్తావని  చిరు  వేసవి  తెస్తావని 
మునిమాపుల  తెరచాటున  చూసా  మరి  వేచా 
బిగి  కౌగిలికొస్తావని  బిడియాలే  దోస్తావని 
ఎద  వాకిట  గిలిగింతగ  పూసే  నా  ఆశా

ప్రాయాలే  పంచాలి  నులివెచ్చగా 
కాలాలే  తోచాలీ  సరికొత్తగా 
గతజన్మల  పరిచయమే  బతికించెను  మన  కలలే 
పులకింతల  తొలివలపే  కలిగించెను  పరవశమే

ప్రాణమైన  ప్రేమ  మన  ప్రేమ 
హాయి  పేరు  ప్రేమ  మన  ప్రేమ 

చలిరాతిరి  వస్తావని  చిరు  వేసవి  తెస్తావని 
మునిమాపుల  తెరచాటున  చూసా  మరి  వేచా   

పరువాల  తెర  తీసే  చొరవే  దొరికేనా 
క్షణమైనా  గడిపేస్తే  వరమే  ఒడిలోనా 
హృదయాలే  వెలిగించే  గుణమే  ఈ  ప్రేమా 
విరహాలే  కరిగిస్తే  సుఖమే  జడివాన 

గాలైనా  రాకుండా  మన  దారిలో 
హాయేదో  పెరిగింది  మలిసంధ్యలో 
భారాలే  తీరంగా  మది  లోపలా 
గానాలే  చేసింది  ఎద  కోయిలా 

నలువైపుల  రాగాలే  మధువొలికే  మేఘాలే 
వానవిల్లు  విరిసే  మరి  విరిసే  
తేనే  జల్లు  కురిసే  మది  కురిసే

చలిరాతిరి  వస్తావని  చిరు  వేసవి  తెస్తావని 
మునిమాపుల  తెరచాటున  చూసా  మరి  వేచా 

తనువుల్లో  మనస్సుల్లో  జ్వరమే  ఈ  ప్రేమా 
చిగురేసీ  చైత్రంలా  పెరిగే  లోలోన 
అరుదైన  విలువైన  చెలిమె  ఈ  ప్రేమా 
తపియించె  ఎదలోనా  చినుకై  కురిసేనా 

చుక్కలని  దాటించే  అలవోకగా 
ఎక్కడికో  చేర్చేదీ  మలపే  కదా 
మక్కువతో  వేధించే  ప్రతి  జాములో 
చెక్కిళ్ళు  నిమురేటి  చనువే  కదా 

మునుపెరుగని  మురిపాలు  ముదిరాయి  సరదాలు 
పూలజల్లు  ప్రేమ  మన  ప్రేమ 
తీపి  ముళ్ళు  ప్రేమ  ఈ  ప్రేమ 

చలిరాతిరి  వస్తావని  చిరు  వేసవి  తెస్తావని 
మునిమాపుల  తెరచాటున  చూసా  మరి  వేచా 
బిగి  కౌగిలికొస్తావని  బిడియాలే  దోస్తావని 
ఎద  వాకిట  గిలిగింతగా  పూసే  నా  ఆశా 
ప్రాయాలే  పంచాలీ  నులివెచ్చగా 
కాలాలే  తోచాలీ  సరికొత్తగా 

గతజన్మల  పరిచయమే  బతికించెను  మన  వలనే 
పులకింతల  తొలివలపే  కలిగించెను  పరవశమే 
ప్రాణమైన  ప్రేమ  మన  ప్రేమ 
హాయి  పేరు  ప్రేమ  మన  ప్రేమ

చలిరాతిరి  వస్తావని  చిరు  వేసవి  తెస్తావని 
మునిమాపుల  తెరచాటున  చూసా  మరి  వేచా

English

Chaliraatiri vastaavani
Chiru vesavi testaavani
Munimaapula terachaatuna
Choosaa mari vechaa

Bigikougilikostaavani
Bidiyale dostaavani
Eda vaakita giligintaga
Poose naa aasha

Praayaale panchaalee
Nulivecchagaa
Kaalaale tochaalee
Sarikottagaa

Gatajanmala parichayame
Batikinchenu mana kalale
Pulakintala tolivalape
Kaliginchenu paravashame

Praanamaina premaa mana premaa
Haayi peru premaa mana premaa

Chaliraatiri vastaavani
Chiru vesavi testaavani
Munimaapula terachaatuna
Choosaa mari vechaa

Paruvaalaa tera teese
Chorave dorikenaa
Kshanamainaa gadipeste
Varame odilonaa

Hrudayaale veliginche
Guname ee premaa
Virahaale karigiste
Sukhame jadivaanaa

Gaalainaa raakundaa
Mana daarilo
Haayedo perigindi
Malisandhyalo

Bhaaraale teerangaa
Madi lopalaa
Gaanaale chesindi
Eda koyilaa

Naluvaipula raagaale
Madhuvolike meghaale
Vaanavillu virise
Mari virise
Tene jallu kurise
Madi kurise

Chaliraatiri vastaavani
Chiru vesavi testaavani
Munimaapula terachaatuna
Choosaa mari vechaa

Tanuvullo manasullo
Jwarame ee premaa
Chiguresee chaitramlaa
Perige lolonaa

Arudainaa viluvainaa
Chelime ee premaa
Tapiyinche edalonaa
Chinukai kurisenaa

Chukkalane daatinchee
Alavokagaa
Ekkadiko cherchedee
Malape kadaa

Makkuvato vedhinchee
Prati jaamulo
Chekkillu nimiretee
Chanuve kadaa

Munuperugani muripaaloo
Mudiraayi saradaaloo
Poolajallu premaa mana premaa
Teepi mullu premaa ee premaa

Chaliraatiri vastaavani
Chiru vesavi testaavani
Munimaapula terachaatuna
Choosaa mari vechaa

Bigikougilikostaavani
Bidiyale dostaavani
Eda vaakita giligintaga 
Poose naa aashaa

Praayaale panchaalee
Nulivecchagaa
Kaalaale tochaalee
Sarikottagaa

Gatajanmala parichayame
Batikinchenu mana valane
Pulakintala tolivalape
Kaliginchenu paravasahme

Praanamaina premaa mana premaa
Haayi peru premaa mana premaa

Chaliraatiri vastaavani
Chiru vesavi testaavani
Munimaapula terachaatuna
Choosaa mari vechaa

Community

Like, share, and discuss

to start a discussion.