Back to Lyrics
Balagam

Balagam

2023 · 4 songs

Telugu

ఓర్  వారి  ఇంక  పిండుతున్నావ్రా  పాలు  
ఇగెప్పుడు  పోతవ్రా  ఊల్లెకు  నీ  యక్క
ఇగ  పొద్దు  పొద్దున్నే  మొదలుపెట్నావయా  
నీ  పాసుగాల

కోలో  నా  పల్లె  కోడి  కూతల్లే
ఒల్లిరుసుకుందే  కోడె  ల్యాగల్లే
యాప  పుల్లల  చేదు  నమిలిందే  
రామ  రామ  రామ

తలకు  పోసుకుందె  నా  నేల  తల్లే
అలికి  పూసుకుందె  ముగ్గు  సుక్కల్నే
సద్ది  మూటల్నే  సగ  బెట్టుకుందే
బాయి  గిరక  నా  పల్లే

హే  తెల్ల  తెల్లాని  పాలధార  ఓలే
పల్లె  తెల్లారుతుంటదిరా
గుళ్లోని  గంటలు  కాడెడ్ల  మెడలోనే
జంటగ  మోగుత  ఉంటయిరా

నాగలి  భుజాన  పెట్టుకుంటే
దోస్తులు  చెయ్యేసినట్టేరా
గొడ్డు  గోదా  పక్కన  ఉంటే
కొండంత  బలగం  ఉన్నట్టురా

సల్లగాలి  మోసుకొచ్చెరా
సేను  సెల్కల  ముచ్చట్లు
దారి  పొడుగు  సెట్ల  కొమ్మల
రాలుతున్న  పూల  చప్పట్లు

గడ్డి  మోపులు  కాల్వ  గట్టులు
సెమట  సుక్కల్లో  తడిసిన
ఈ  మట్టి  గంధాల

ఊరు  పల్లెటూరు  
దీని  తీరే  అమ్మ  తీరు
కొంగులోన  దాసిపెట్టి  
కొడుకుకిచ్చె  ప్రేమ  వేరు

ఊరు  పల్లెటూరు  
దీని  తీరే  కన్నకూతురు
కండ్ల  ముందే  ఎదుగుతున్న  
సంబరాల  పంటపైరు

వంద  గడపల  మంద  నా  పల్లె
గోడ  కట్టని  గూడు  నా  పల్లె
సెరువుల్ల  తుల్లేటి  జెల్ల  శాపోలే  
రామ  రామ  రామ

మావ  అత్త  బావ  బాపు  వరసల్లే
ఊరంత  సుట్టాల  ముల్లె  నా  పల్లె
దారంలో  ఒదిగిన  పూల  దండల్లే
రంగుల  సింగిడి  పల్లే

ఆలు  మొగలు  ఆడే  ఆటలు
అత్త  కోడండ్ల  కొట్లాటలు
సదిరి  సెప్పలేని  మొగని  తిప్పలే  తిప్పలు

రచ్చబండ  మీద  ఆటలు
చాయబండి  కాడ  మాటలు
వొచ్చే  పొయ్యేటోల్ల  మందలిచ్చుకునే  
సంగతే  గమ్మతి

తట్ట  బుట్టలల్ల  కూర  తొక్కులు
సుట్ట  బుట్టలల్ల  బీడి  కట్టలు
చేతనైన  సాయం  జేసే  మనుషులు
మావి  పూత  కాసినట్టే  మనుసులు
ఊరంటే  రోజు  ఉగాది
సచ్చేదాకా  ఉంటది  యాది

ఊరు  నా  ఊరు  
దీని  తీరే  అమ్మ  తీరు
కొంగులోన  దాసిపెట్టి  
కొడుకుకిచ్చె  ప్రేమ  వేరు

ఊరు  పల్లెటూరు  
దీని  తీరే  కన్నకూతురు
కండ్ల  ముందే  ఎదుగుతున్న  
సంబరాల  పంటపైరు

వంద  గడపల  మంద  నా  పల్లె
గోడ  కట్టని  గూడు  నా  పల్లె
సెరువుల్ల  తుల్లేటి  జెల్ల  శాపోలే  
రామ  రామ  రామ

మావ  అత్త  బావ  బాపు  వరసల్లే
ఊరంత  సుట్టాల  ముల్లె  నా  పల్లె
దారంలో  ఒదిగిన  పూల  దండల్లే
రంగుల  సింగిడి  పల్లే

English

Kolo Naa Palle Kodi Koothalle
Ollirusukundhe Kode Lyaagalle
Yaapa Pullala Chedhu Namilindhe 
Rama Rama Rama

Thalaku Posukundhe Naa Nela Thalle
Aliki Poosukundhe Muggu Sukkalne
Saddhu Mootalne Saga Bettukundhe
Baayi Giraka Naa Palle

Hey Thella Thellaani Paala Dhaara Ole
Palle Tellaaruthuntadiraa
Gulloni Gantalu Kaadedla Medalone
Jantaga Mogutha Untayiraa

Naagali Bhujaana Pettukunte
Dosthulu Cheyyesinatteraa
Goddu Godha Pakkana Unte
Kondantha Balagam Unnatturaa

Sallagaali Mosukochheraa
Senu Selkala Muchhatlu
Daari Podugu Setla Kommala
Raaluthunna Poola Chappatlu

Gaddimopulu Kaalva Gattulu
Semata Sukkallo Thadisina
Ee Matti Gandhaala

Ooru Naa Ooru 
Deeni Teere Amma Teeru
Kongulona Daasipetti 
Kodukukichhe Prema Veru

Ooru Palletooru 
Deeni Teere Kannakoothuru
Kandla Mundhe Edhuguthunna 
Sambaraala Pantapairu

Vandha Gadapala Mandha Naa Palle
Goda Kattani Goodu Naa Palle
Seruvulla Thulleti Jella Shaapole 
Rama Rama Rama

Maava Attha Bava Bapu Varasalle
Oorantha Suttaala Mulle Naa Palle
Daaramlo Odigina Poola Dhandalle
Rangula Singidi Palle

Aalu Mogalu Aade Aatalu
Attha Kodandla Kotlaatalu
Sadhiri Seppaleni Mogani Thippale Thippalu

Rachhabanda Meeda Aatalu
Chaayabandi Kaada Maatalu
Vochhe Poyyetolla Mandhalichhukune
Sangathe Gammathi

Thatta Buttalalla Koora Thokkulu
Sutta Buttalalla Beedi Kattalu
Chethanaina Saayam Jese Manushulu
Maavi Pootha Kaasinatte Manusulu
Oorante Roju Ugadi
Sachhedhaaka Untadi Yaadhi

Ooru Naa Ooru 
Deeni Teere Amma Teeru
Kongulona Daasipetti 
Kodukukichhe Prema Veru

Ooru Palletooru 
Deeni Teere Kannakoothuru
Kandla Mundhe Edhuguthunna 
Sambaraala Pantapairu

Vandha Gadapala Mandha Naa Palle
Goda Kattani Goodu Naa Palle
Seruvulla Thulleti Jella Shaapole 
Rama Rama Rama

Maava Attha Bava Bapu Varasalle
Oorantha Suttaala Mulle Naa Palle
Daaramlo Odigina Poola Dhandalle
Rangula Singidi Palle

Community

Like, share, and discuss

to start a discussion.