Back to Lyrics
Anthahpuram

Anthahpuram

1998 · 4 songs

Telugu

కళ్యాణం  కానుంది  కన్నె  జానకిక్కి  
కళ్యాణం  కానుంది  కన్నె  జానకిక్కి 
వైభోగం  రానుంది  రామ  చంద్రుడికి  
వైభోగం  రానుంది  రామ  చంద్రుడికి 

దేవతలే  దిగి  రావాలి  జరిగే  వేడుకక్కి   
రావమ్మా  సీతమ్మ  సిగ్గు  దొంతరల్లో  
రావయ్యా  రామయ్య  పెళ్లి  శోభలతో 

వెన్నెల్లో  నడిచే  మబ్బులాగా  వర్షంలో  తడిసె  సంద్రంలాగా 
ఊరేగే  పువ్వులో  చెలరేగే  నవ్వుల్లో  అంతా  సౌందర్యమే 
అన్ని  నీ  కోసమే 
వెన్నెల్లో  నడిచే  మబ్బులాగా  వర్షంలో  తడిసె  సంద్రంలాగా 

నాలో  ఎన్ని  ఆశలు  అలల్లా  పొంగుతున్నవి 
నీతో  ఎన్ని  చెప్పిన  మరెన్నో  మిగులుతున్నవి 
కల్లాల్లోనే  వాలి  నీలాకాశం  అంతా  ఎలా  వొదిగిందో 
ఆ  గగనాన్ని  ఏలే  పున్నమి  రాజు  ఎదలో  ఎలా  వాలాడో 

నక్షత్రాలన్నీ  ఇలా  కళలయ్యి  వొచ్చాయి 
చూస్తూనే  నిజమయ్యి  అవి  ఎదుటే  నిలిచాయి 
ఆణువణువూ  అమృతంలో  తడిసింది  అద్భుతంగా 
వెన్నెల్లో  నడిచే  మబ్బులాగా  వర్షంలో  తడిసె  సంద్రంలాగా 

ఇట్టే  కరుగుతున్నది  మహా  ప్రియమైన  ఈ  క్షణం 
వెనకకు  తిరగనన్నది  ఎలా  కాలాన్ని  ఆపడం 
మదిల  మంటే  ఈడు  తీయని  శృతిగా  మారి  ఎటో  పోతుంటే 
కావాలంటే  చూడు  నీ  ఆనందం  మనతో  తాను  వస్తుంటే 

ఈ  హాయి  అంత  మహా  భద్రంగా  దాచి 
పాపాయి  చేసి  నా  ప్రాణాలే  పోసి  నూరేళ్ళ  కానుకల్లే
ని  చేతికియ్యలేనా 

ఆకాశం  అంతఃపురమైంది  నా  కోసం  అందిన  వరమైంది 
రావమ్మా  మహారాణి  ఏలమ్మ  కాలాన్ని అంది  ఈ  లోకమే  అంత  సౌందర్యమే
ఆకాశం  అంతఃపురమైంది  నా  కోసం  అందిన  వరమైంది

English

Kalyaanam kaanundi kanne jaanakikii 
kalyaanam kaanundi kanne jaanakikii
vaibhogam raanundi raama chandrudiki 
vaibhogam raanundi raama chandrudiki

Devatale digi raavaali jarige vedukakii
raavamma seetamma siggu dontaraalo 
raavayya raammaya pelli shobhalato

Vennello nadiche mabbulaaga varshamlo tadise sandramlaaga
oorege puvvulo chelarege navvullo antaa soundaryame
anni nee kosame
vennello nadiche mabbulaaga varshamlo tadise sandramlaaga

Naalo enni aasalu alallaa pongutunnavi
neeto yennii cheppina marenno migulutunnavi
kallallone vaali neelaakaasam anta yelaa vodigindo
aa gaganaanni yele punnami raaju yedalo elaa vaalaado

Nakshatralanni ilaa kalalayyi vocchaayi
choostune nijamayyi avi yedate nilichaayi
anuvanuvu amrutamlo tadisindi adbhutamgaa
vennello nadiche mabbulaaga varshamlo tadise sandramlaaga

Itte karugutunnadi maha priyamaina ee kshanam
venakaku tiraganannadi yelaa kaalaanni aapadam

madila mante eedu teeyani srutigaa maari yeto potunte
kaavaalante choodu nee aanandam manato tanu vastunte

ee haayi anta maha bhadramga daachi
paapaayi chesi naa praanaale posi noorella kaanukalle
ne chethikiyyalena

akasham anthahpuramaindhe naa kosam andhina varamaindhe
ravamma maharani yelamma kalanni andhi e lokame antha soundharyame
akasham anthahpuramaindhe naa kosam andhina varamaindhe

Community

Like, share, and discuss

to start a discussion.