MoviRock | Saripodhaa Sanivaaram Movie | Ullaasam SongBack to Album
LyricsPlain Lyrics

అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే

అలవాటే లేని ఏవో ఆనందాలే

నా గుండెల్లో ఏదో వాలే వాలే

వేషాలే మార్చే నాలో ఆవేశాలే

కోపాలే కూల్చే నీతో సల్లాపాలే

నీ మైకంలో ప్రాణం తేలే తేలే

ఏమిటో తెలియదెందుకో

మనసు నిన్నలా నేడు లెదే

కారణం తెలుసుకోవడానికని

పిలిచినా పలకదే

ఉల్లాసం ఉరికే ఎదలో

ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో

ఉప్పొంగే ఊహల జడిలో

మనకే మనమే ఎవరో

మౌనాలే మన ఊసులలో

మాటలే తప్పిపోయే పెదవులలో

మిన్నంటే మనసుల సడిలో

మనతో మనమే ఎటుకో

అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే

అలవాటే లేని ఏవో ఆనందాలే

నా గుండెల్లో ఏదో వాలే వాలే

కల్లోలం కమ్మేసే అంతా నీ వలనే

కళ్లారా నువ్వే నవ్వినా క్షణమునే

నా కనులకే కొత్త వెలుగులే చేరి

కలతలే చెయ్యి విడిచెలే

హే కలకే వేల తళుకులే

నువ్వు కనబడే దాక కలలే

ఇరువురి చేతిలోని రేఖలన్నీ

ముడిపడే రాత బలపడే

విడివిడి దారులేమో

వీడిపోని జంటై కదిలే ఆ ఆ

ఉల్లాసం ఉరికే ఎదలో

ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో

ఉప్పొంగే ఊహల జడిలో

మనకే మనమే ఎవరో

ఉల్లాసం ఉరికే ఎదలో

ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో

ఉప్పొంగే ఊహల జడిలో

మనకే మనమే ఎవరో

మౌనాలే మన ఊసులలో

మాటలే తప్పిపోయే పెదవులలో

మిన్నంటే మనసుల సడిలో

మనతో మనమే ఎటుకో ఓ ఓ ఓ

ఉల్లాసం ఉరికే ఎదలో

మనకే మనమే ఎవరో

UllaasamSaripodhaa Sanivaaram
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.