
Nuvvunte Chaley
Andhra King Taluka
ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెలో చేరిందే
నువ్వెవరో నాలో అని అడిగానే
తానేగా ప్రేమని తెలిపిందే
పరిచయం లేదని అడిగా ప్రేమంటే
కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే
నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే
దారేలేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది
నాకే తెలియని నాలో యుద్ధమా
లోలోన సంద్రమా
లేదే పొంగుతున్నదే ఇంకేదో
పేరు లేదుగా ఇంతే మాట రాదుగా
అంతే ఒప్పుకోమరి వింతేలే
నువ్వుంటే చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే
ఓ ఓ ఓ ఓ నువ్వుంటే చాలే
ఓ ఓ ఓ ఓ నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే

Community
Like, share, and discuss
Shop This Song Scene
Products and style picks curated from Nuvvunte Chaley.
MoviRock may earn a commission from qualifying affiliate links.

to start a discussion.