చక్కనైన చిక్కనైన చుక్కలంటి కోయిలా
చక్కెరలంటి ఉక్కిరిలాంటి ముక్కెరలంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా
అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు
కంటి మీద నిద్దరేమో వాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు
దాచమంటే చిన్ని గుండె చాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
నువ్వు లేకపోతె దిక్కు తోచదు
చల్లగాలి కూడా ఇటు వీచదు
ఈ మానసిక ఎవరికి ఇవ్వదు
నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు
నా ప్రేమ ఎమో ఊహలకి అందదు
నీకు తప్పా ఎవరికి చెందదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
చక్కనైన చిక్కనైన చుక్కలంటి కోయిలా
చక్కెరలంటి ఉక్కిరిలాంటి ముక్కెరలంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా
కాటు కట్టుకున్న నీ కన్నులే
చేతిలోన జల్లెనే వెన్నిలే
మూట కట్టి దాచుకుంటానులే ఓ ఓ
ముద్దబంతి లాంటి నీ నవ్వులే
జరుతుంటే ఏరుకుంటానులే
దండ లాగా అల్లుకుంటానులే ఓ ఓ
నువ్వుంటే చాలు కదే
ఇంకేది వద్దు కదే
అంతా ఇష్టం నువ్వు కదే ఓ ఓ
నా ప్రాణం నీదే కదే
నీ ధ్యానం నాదీ కదే
అరుదైన ప్రేమ కదే
నిజంగా మనదే
నువ్వు అందమైనా అందమైనా ఆడపిల్లవే
కొత్త ఆశలేవో రేపుతున్న అగ్గిపుల్లవే
చక్కనైన చిక్కనైన చుక్కలంటి కోయిలా
చక్కెరలంటి ఉక్కిరిలాంటి ముక్కెరలంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా
అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు
కంటి మీద నిద్దరేమో వాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు
దాచమంటే చిన్ని గుండె చాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
నువ్వు పక్కనుంటే చూపు తిప్పదు
ఎంత తిట్టుకున్నా గాని తప్పదు
నువ్వు ధూరం ఉంటె నాకు నచ్చదు
తన్నుకొచ్చే ఎడుపేమో ఆగదు
నీకు నాకు రాసి ఉంది మరదు
మరిపోతే ఊపిరిక ఆడదు
చక్కనైన చిక్కనైన చుక్కలంటి కోయిలా
చక్కెరలంటి ఉక్కిరిలాంటి ముక్కెరలంటి కోయిలా
జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా
హోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా

Community
to start a discussion.