Audio-only lyric sync
Enno enno
Pelli Chesukundham
ఓ డాడీ డాడీ లవ్ యు
ఓ మమ్మీ మమ్మీ లవ్ యు
వీ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా
ఇలాగే నిత్యం మన వెంట
సంద్రంలో సందడంతా
చంద్రుళ్ళో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరే మన ఇంట
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
ఏ పూటైనా హ్యాపీగా ఉంటాం
మనకొద్దు అంతకు మించే వేరే వేదాంతం
ఏ బాటైనా పరవాలేదంట సమయంతో
సాగటమే మన సింపుల్ సిద్ధాంతం
చిరుగాలికి పరిమలమిచ్చే సిరిమల్లెలా వనమై ఉందాం
గగనాన్ని నేలను కలిపి హరివిల్లులా వంతెన అవుదాం
ఆనందం అంటే అర్ధం మనమందాం
ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
ఓ డాడీ డాడీ లవ్ యు
ఓ మమ్మీ మమ్మీ లవ్ యు
వీ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్
మమకారాలే పూవులా సంకెళ్ళై గత జన్మల
రుణ బంధాలను గుర్తుకు తెస్తాయి
అనురాగాలే గుండెల సవాళ్ళై బతుకంటే
ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి
వరమల్లే దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం
సిరులున్న దొరకానిదేమో సరదాలతో ఈ సావాసం
చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి
ఏ చింత చెంతకు రాణి అందాల ఈ సందడి
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం
కాదా చలాకి నవ్వుల కేరింత
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే
రాదా ఇలాగే నిత్యం మన వెంట
సంద్రంలో సందడంతా
చంద్రుళ్ళో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరే మన ఇంట
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం
కాదా చలాకి నవ్వుల కేరింత
Community
to start a discussion.