Back to Movies
Anandam

Anandam

ఆనందం

2001150 min8.2
Telugu
India
Romance

Watch On

Overview

Two neighbors study in the same college, but hate each other immensely. A series of events changes their feelings when they unknowingly write to each other under alias names. కిరణ్, ఐశ్వర్య చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్ళలో నివసిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికీ గొడవలు పడుతూ ఉంటారు. కళాశాలకు వెళ్ళే వయసొచ్చినా సరే ఒకరినొకరు ఆటపట్టించుకుంటూనే ఉంటారు. ఒకసారి ఐశ్వర్య కుటుంబం ఇల్లు ఖాళీ చేసే ఊటీ వెళ్ళిపోతారు. తన శత్రువు పక్కనుంచి వెళ్ళిపోయినంతగా సంబరాలు చేసుకుంటాడు కిరణ్. ఊటీ వెళ్ళిన ఐశ్వర్యకు దీపిక పేరుతో వచ్చిన ఉత్తరం, గ్రీటింగ్ కార్డు కనబడతాయి. తాముండే ఇంట్లో పూర్వం దీపిక కుటుంబం ఉండేదనీ ఆమెకు ఆ ఉత్తరం, గ్రీటింగ్ కార్డు చేర్చాలని ప్రయత్నించిన ఐశ్వర్యకు దీపిక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనే చేదు నిజం ఆమె స్నేహితురాలి ద్వారా తెలుస్తుంది. దీపిక, వంశీ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. వెంకట్ తమ ప్రేమ విషయం చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాలని ఊరు వెళతాడు. రోజులు గడుస్తున్నా అతను తిరిగి రాకపోయేసరికి దీపిక ఇంట్లో ఆమెకు వేరే సంబంధాలు చూడటం మొదలుపెడతారు. సున్నితమనస్కురాలైన ఆమె ఇష్టం లేని పెళ్ళి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. దీపిక చనిపోయిందన్న నిజం వంశీకి తెలిస్తే ఏమవుతుందోనని ఆమె పేరుతో ఐశ్వర్య బదులు రాయడం ప్రారంభిస్తుంది. మరో వైపు వంశీ ఓ ప్రమాదంలో మరణించి ఉంటాడు. అతని స్నేహితుడు కిరణ్, వంశీ ప్రేయసి అతని మరణం గురించి తెలిస్తే తట్టుకోలేదని అతని తరపున ఉత్తరాలు రాస్తుంటాడు. చివరికి ఇద్దరు బద్ధశత్రువుల మధ్య వైరం స్నేహితుల ప్రేమ కోసం చేసిన పని వల్ల ప్రేమగా ఎలా మారిందనేది మిగతా కథ.

Community

Like, share, and discuss

Romance

Watch On