Back to Lyrics
Oke Oka Jeevitham

Oke Oka Jeevitham

2022 · 1 song

Telugu

అమ్మా  వినమ్మా
నేనానాటి  నీ  లాలి  పదాన్నే
ఓ  అవునమ్మా  నేనేనమ్మా
నువ్వు  ఏనాడో  కనిపెంచిన  స్వరాన్నే
మౌనమై  ఇన్నాళ్లు  నిదురలోనే  ఉన్నా
గానమై  ఈనాడే  మేలుకున్నా

నీ  పాదాలకు  మువ్వల్లా
నా  అడుగులు  సాగాలమ్మ
నీ  పెదవుల  చిరునవ్వుల్లా
నా  ఊపిరి  వెలగాలమ్మా

నిరంతరం  నీ  చంటిపాపల్లే
ఉండాలి  నే  నెన్నాళ్ళకీ
నిన్నొదిలేంతగా  ఎదగాలనుకోనే  అమ్మా
అణువణువణువు  నీ  కొలువే  అమ్మా
ఎదసడిలో  శృతిలయలు  నువ్వే  అమ్మా
నే  కొలిచే  శారదవే  నను  నిత్యం  నడిపే  సారథివే

బెదురు  పోవాలంటే  నువ్వు  కనిపించాలి
నిదర  రావాలంటే  కథలు  వినిపించాలి
ఆకలయ్యిందంటే  నువ్వే  తినిపించాలి
ప్రతి  మెతుకు  నా  బ్రతుకనిపించేలా

నువ్వుంటేనే  నేను  నువ్వంటే  నేను
అనుకోలేకపోతే  ఏమైపోతానో
నీ  కడచూపే  నన్ను  కాస్తూ  ఉండక
తడబడి  పడిపోనా  చెప్పమ్మా

మరిమరి  నను  నువు  మురిపంగా
చూస్తూ  ఉంటె  చాలమ్మ
పరిపరి  విధముల  గెలుపులుగా
పైకి  ఎదుగుతూ  ఉంటానమ్మా

అయినా  సరే  ఏనాటికి
ఉంటాను  నీ  పాపాయినై
నిన్నొదిలేంతగా  ఎదగాలనుకోనే

నిరంతరం  నీ  చంటిపాపల్లే
ఉండాలి  నే  నెన్నాళ్ళకీ
నిరంతరం  నీ  చంటిపాపల్లే
ఉండాలి  నే  నెన్నాళ్ళకీ
నిరంతరం  నీ  చంటిపాపల్లే
ఉండాలి  నే  నెన్నాళ్ళకీ

నిన్నొదిలేంతగా  ఎదగాలనుకోనే  అమ్మా
అణువణువణువు  నీ  కొలువే  అమ్మా
ఎదసడిలో  శృతిలయలు  నువ్వే  అమ్మా
నే  కొలిచే  శారదవే  నను  నిత్యం  నడిపే  సారథివే
అమ్మా

English

Amma Vinamma
Nenaanaati Nee Laali Padaanne
O Avunamma Nenenamma
Nuvu Enaado Kanipenchina Swaraanne
Mounamai Innaallu Niduralone Unna
Gaanamai Eenaade Melukunnaa

Nee Paadalaku Muvvallaa
Naa Adugulu Saagaalamma
Nee Pedavula Chirunavvullaa
Naa Oopiri Velagaalammaa

Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki
Ninnodhilenthaga Edhagaalanukone Amma
Anuvanuvanuvu Nee Koluve Amma
Edhasadilo Sruthilayalu Nuvve Amma
Ne Koliche Saradave
Nanu Nithyam Nadipe Sarathive

Beduru Povaalante Nuvvu Kanipinchaali
Nidara Raavaalante Kathalu Vinipinchaali
Aakalayyindhante Nuvve Thinipinchaali
Prathi Methuku Naa Brathukanipinchaalaa

Nuvvuntene Nenu Nuvvante Nenu
Anukolekapothe Emaipothaano
Nee Kadachoope Nannu Kaasthu Undaka
Thadabadi Padiponaa Cheppammaa

Mari Mari Nanu Nuvu Muripanga
Choosthu Unte Chaalamma
Pari Pari Vidhamula Gelupulugaa
Paiki Edhuguthu Untaanammaa

Ayinaa Sare Enaatiki
Untaanu Nee Paapaayinai
Ninnodhilenthaga Edhagaalanukone

Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki
Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki
Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki

Ninnodhilenthaga Edhagaalanukone Amma
Anuvanuvanuvu Nee Koluve Amma
Edhasadilo Sruthilayalu Nuvve Amma
Ne Koliche Saradave
Nanu Nithyam Nadipe Sarathive
Ammaa

Community

Like, share, and discuss

to start a discussion.