Back to Lyrics
Gokulamlo Seetha

Gokulamlo Seetha

1997 · 2 songs

Telugu

తళుక్  తళుక్  మని  తళుకుల  తార 
మినుక్  మినుక్  మని  మిల  మిల  తార 
చమక్  చమక్  మని  చిలిపి  సితార  ఓహో 
తళుక్  తళుక్  మని  తళుకుల  తార 
మినుక్  మినుక్  మని  మిల  మిల  తార 
చమక్  చమక్  మని  చిలిపి  సితార  ఓహో 

మనసున్న  కనులుంటే  ప్రతి  చోట  మధుమాసం  కనిపించదా 
కనులున్న  మనసుంటే  బ్రతుకంతా  మనకోసం  అనిపించిందా   
బంగారు  భావాల  ప్రియా  గీతం 
రంగేళి  రాగాల  జలపాతం 
మనలోనే  చూపించదా   

తళుక్  తళుక్  మని  తళుకుల  తార 
మినుక్  మినుక్  మని  మిల  మిల  తార 
చమక్  చమక్  మని  చిలిపి  సితార  ఓహో
తళుక్  తళుక్  మని  తళుకుల  తార 
మినుక్  మినుక్  మని  మిల  మిల  తార 
చమక్  చమక్  మని  చిలిపి  సితార  ఓహో

మనసున్న  కనులుంటే  ప్రతి  చోట  మధుమాసం  కనిపించదా 

అలలై  ఎగసిన  ఆశ  నాట్యం  చేసే  వేళా 
అలుపే  ఎరుగని  శ్వాస  రాగం  తీసే  వేళా 
దిశలన్నీ  తల  వొంచి  తొలగే  క్షణం 
ఆకాశం  పలికింది  అభినందనం 
అదిగదిగో  మన  కోసం  తారాగణం 
తళుకులతో  అందించే  నీరాజనం 
మన  దారికెదురున్నదా 

మనసున్న  కనులుంటే  ప్రతి  చోట  మధుమాసం  కనిపించదా 

నవ్వే  పెదవుల  పైన  ప్రతి  మాట  ఒక  పాటే 
ఆడే  అడుగుల  లోన  ప్రతి  చోట  పూబాటే 
గుండెల్లో  ఆనందం  కొలువున్నదా 
ఎండైనా  వెన్నెల్లా  మురిపించదా 
కాలాన్నే  కవ్వించే  కల  ఉన్నదా 
కష్టాలు  కన్నీళ్లు  మరిపించదా   
జీవించడం  నేర్పదా   

మనసున్న  కనులుంటే  ప్రతి  చోట  మధుమాసం  కనిపించదా 
కనులున్న  మనసుంటే  బ్రతుకంతా  మనకోసం  అనిపించిందా   
బంగారు  భావాల  ప్రియా  గీతం 
రంగేళి  రాగాల  జలపాతం 
మనలోనే  చూపించదా

English

Thaluk thaluk mani thalukula thara
Minuk minuk mani mila mila thara
Chamak chamak mani chilipi sithara oho
Thaluk thaluk mani thalukula thara
Minuk minuk mani mila mila thara
Chamak chamak mani chilipi sithara oho

Manasunna kanulunte prati chota madhumasam kanipinchada
Kanulunna manasunte brathukantha manakosam anipinchada
Bangaru bhavala priya geetham
Rangeli raagala jalapatham
Manalone chupinchada

Thaluk thaluk mani thalukula thara
Minuk minuk mani mila mila thara
Chamak chamak mani chilipi sithara oho
Thaluk thaluk mani thalukula thara
Minuk minuk mani mila mila thara
Chamak chamak mani chilipi sithara oho

Manasunna kanulunte prati chota madhumasam kanipinchada

Alalai egasina aasa natyam chese vela
Alupe erugani swasa raagam theese vela
Disalanni thala vonchi tholage kshanam
Aakasam palikindi abhinandanam
Adigadigo mana kosam tharaganam
Thalukulatho andiche neerajanam
Mana daarikedurunnadaa

Manasunna kanulunte prati chota madhumasam kanipinchada

Navve pedavula paina prathi maata oka paate
Aade adugula lona prathi chota poobaate
Gundello anandam koluvunnada
Edaina vennella muripinchada
Kalanne kavvinche kala unnada
Kashtalu kanneellu maripinchada
Jeevinchadam nerpada

Manasunna kanulunte prati chota madhumasam kanipinchada
Kanulunna manasunte brathukantha manakosam anipinchada
Bangaru bhavala priya geetham
Rangeli raagala jalapatham
Manalone chupinchada

Community

Like, share, and discuss

to start a discussion.