Back to Lyrics

Aiithe

2003 · 1 song

Telugu

చిటపట  చినుకులు  అరచేతులలో
ముత్యాలైతే  అయితే  అయితే 
తరగని  సిరులతో  తల  రాతలనే
మార్చేస్తుంటే  ఇట్టె  ఇట్టె 

అడ్డు  చెప్పదే  అంబ్రెల్లా  ఎపుడు
ఓ  వాన  నువ్వొస్తానంటే 

నిధులకు  తలుపులు  తెరవగ
మనకొక  అలీ  బాబా  ఉంటె 
అడిగిన  తరుణమే  పరుగులు  తీసే
అల్లావుద్దీన్  జెనీ  ఉంటె 

చూపదా  మరి  ఆ  మాయదీపం
మన  ఫేటే  ఫ్లైట్  అయ్యే  రన్వే   

నడిరాత్రే  వస్తావె  స్వప్నమా   
పగలంతా  ఏం  చేస్తావ్  మిత్రమా 
ఊరికినే  ఊరిస్తే  న్యాయమా   
సరదాగా  నిజమైతే  నష్టమా 

మోనాలిసా  మొహం  మీదే  నిలుస్తావా
ఓ  చిరునవ్వా  ఇలా  రావా 

వేకువనే  మురిపించే  ఆశలు   
వెనువెంటనే  అంతా  నిట్టూర్పులు 
లోకంలో  లేవా  ఏ   రంగులు 
నలుపొకటే  చూపాలా  కన్నులు 

ఇలాగేనా  ప్రతి  రోజు  ఎలాగైనా
ఏదో  రోజు  మనదై  రాదా 

చిటపట  చినుకులు  అరచేతులలో
ముత్యాలైతే  అయితే  అయితే 
తరగని  సిరులతో  తల  రాతలనే
మార్చేస్తుంటే  ఇట్టె  ఇట్టె

English

Chitapata chinukulu arachethulalo
Muthyaalaithe aithe aithe
Tharagani sirulatho thala raathalane
Maarchesthunte itte itte

Addu cheppadhe umbrella epudu
O vaana nuvvosthaanante

Nidhulaku thalupulu theravaga
Manakoka ali baaba unte
Adigina tharuname parugulu theese
Allauddin genie unte

Choopadha mari aa maaya deepam
Mana fate e flight ayye runway 

Nadiraathre vasthaave swapnama 
Pagalantha em chesthaav mithramaa
Oorikine ooristhe nyayama 
Saradaaga nijamaithe nashtama

Monalisa moham meede nilusthaava
O chirunavva ilaa raava

Vekuvane muripinche aashalu
Venu ventane antha nittoorpulu
Lokamlo leva e rangulu
Nalupokate choopaala kannulu

Ilaagena prathi roju elaagaina
Edho roju manadhai raadha

Chitapata chinukulu arachethulalo
Muthyaalaithe aithe aithe
Tharagani sirulatho thala raathalane
Maarchesthunte itte itte

Community

Like, share, and discuss

to start a discussion.